Saripoda 10 days Collections: 100 కోట్లకు అడుగు దూరంలో సరిపోదా.. బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న నాని
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరిపోదా శనివారం చిత్రం రెండో వారంలో కూడా బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్నది. వరదలు, తుఫాన్ పరిస్థితుల కారణంగా కొంత వసూళ్లు క్షీణించినప్పటికీ. .రెండో శనివారం ఈ సినిమా కలెక్షన్ల పరంగా సత్తా చాటింది. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం 10వ రోజున రికార్డు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
సరిపోదా శనివారం సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. తొలి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 24 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. తొలివారం ముగిసే సమయానికి ఈ చిత్రం ఇండియాలో 43 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది. ఇక రెండో వారంలో కూడా అదే జోష్‌ను చూపిస్తున్నది.

గత 9 రోజుల్లో ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగులో 40 కోట్ల రూపాయలు, తమిళంలో 4.5 కోట్లు, కన్నడలో 6 కోట్ల రూపాయలు, కేరళలో 1 కోటి రూపాయలు, హిందీలో, ఇతర ప్రాంతాల్లో 2 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో 50 కోట్ల మైలురాయిని దాటింది.
ఓవర్సీస్‌లో నాని మూవీకి మంచి స్పందన వ్యక్తమవుతున్నది. ఈ సినిమా ఇప్పటికే నార్త్ అమెరికాలో 2.5 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 20 కోట్ల వరకు రాబట్టింది. ఇక 10వ రోజు కూడా భారీ కలెక్షన్లు అంటే.. 135 లోకేషన్లలో 70K వసూళ్లు నమోదు చేసింది. దాంతో ఈ సినిమా కెనడా, అమెరికాలో 3 మిలియన్లు మార్కును దాటింది. ఇతర దేశాల్లో కలిపి ఈ సినిమా 4.5 మిలియన్ డాలర్లు నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

రెండో వారంలో ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే. .9వ రోజు 1.5 కోట్ల రూపాయలు ఇండియాలో వసూలు చేసింది. ఇక 10వ రోజు ఊహించని విధంగా కలెక్షన్లు రాబట్టింది. సుమారుగా ఈ సినిమా 4 కోట్ల రూపాయల నికర వసూళ్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 60 కోట్ల నికర వసూళ్ల మార్కును దాటే ప్రయత్నం చేస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో నాని చిత్రం స్టడీగా వసూళ్లు రాబట్టడంతో 100 కోట్ల రూపాయలకు చేరువైంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా సుమారుగా 35 కోట్లకుపైగా, ఇండియాలో 60 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఈ వారాంతంలో 100 కోట్ల మైలురాయిని దాటుతుంది ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











