Saripoda Collections: సరిపోదా బాక్సాఫీస్ అరుదైన రికార్డు.. టాప్ 20 లో నాని మూవీ.. ఎన్ని కోట్లంటే?
సెన్సిబుల్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. నేచురల్ స్టార్ నానీ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన ఈ సినిమా రెండో వారంలో కూడా అత్యధికంగా వసూళ్లను రాబడుతున్నది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూపొందించిన ఈ సినిమా గత 13 రోజుల్లో ఏ మేరకు కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలో ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. తొలివారంలో తెలుగులో 40 కోట్ల రూపాయలు నికరంగా, తమిళంలో 3 కోట్లు, మలయాళంలో 1 కోటి రూపాయలు, హిందీలో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతొ ఈ సినిమా తొలివారం ఇండియాలో 43 కోట్ల రూపాయల నికర వసూళ్లు రాబట్టింది.

ఇక రెండో వారంలో ఈ సినిమా స్టడీగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా 12వ రోజు 1.2 కోట్లు నికరంగా వసూలు చేసింది. రెండో శనివారం 5 కోట్లు నమోదు చేసింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండో వారంలో 11 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. దక్షిణాదిలో అంతగా వసూళ్లు రాబట్టిన దాఖలు కనిపించడం లేదు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
సరిపోదా శనివారం గత 13 రోజులు వివిధ రాష్ట్రాల్లో రాబట్టిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాలో 50 కోట్లు, కన్నడలో 7 కోట్ల రూపాయలు, తమిళంలో 4.5 కోట్లు, మలయాళంలో 1 కోటి రూపాయలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 50 కోట్ల రూపాయల నికర వసూళ్లు నమోదు చేసింది.

ఓవర్సీస్‌తోపాటు నార్త్ అమెరికాలో సరిపోదా శనివారం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం 13వ రోజున కూడా భారీగా వసూళ్లు సాధించింది. గత 12 రోజుల్లో 2.4 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా 13వ రోజు 50K వసూలు చేసింది. దాంతో సినిమా 3 మిలియన్ డాలర్లు అంటే 24 కోట్లు వసూలు చేసింది. ఇతర దేశాలతో కలిపి ఈ సినిమా 4.8 మిలియన్ డాలర్లు అంటే 38 కోట్ల రూపాయలు వరకు కలెక్ట్ చేసింది. నార్త్ అమెరికాలో టాప్ 20 గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
సరిపోదా శనివారం చిత్రం 13వ రోజున కూడా నిలకడగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా 13వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 1.2 కోట్లు, ఇతర భాషల్లో 50 లక్షలు రాబట్టింది. అమెరికా, ఇతర ప్రాంతాల్లో కలిపి 50 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 88 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లకు చేరువైంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











