100 కోట్ల కొల్లగొట్టిన సరిపోదా శనివారం.. నాని మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం చరిత్ర సృష్టించింది. నానికి ఈ సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్లు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం 19 రోజుల్లో ఈ రికార్డును సొంతం చేసుకొన్నది. సెప్టెంబర్ 29వ తేదీన రిలీజైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న తుఫాన్ పరిస్థితులను ఎదురించి భారీ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్ వివరాల్లోకి వెళితే..
ప్రియాంక అరుల్ మోహన్, ఎస్‌జే సూర్య, మురళీ శర్మ, సాయి కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తన సొంత బ్యానర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సుమారుగా 100 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా దాదాపు 50 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్ల ట్రార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

ఏపీ, తెలంగాణలో తీవ్ర తుఫాన్ సంక్షోభంలో కూడా నిలకడగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తొలివారంలో 43 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక రెండోవారంలో 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో రెండు వారాల్లో 56 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఇక మూడో వారంలో ఈ సినిమా ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
సరిపోదా శనివారం చిత్రం వివిద భాషల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ, నైజాంలో ఈ సినిమా 53 కోట్ల రూపాయలు, కన్నడలో 8 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5 కోట్ల రూపాయలు, కేరళలో 1 కోటి రూపాయలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 2.5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ ఇండియా వైడ్‌గా 69 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక ఒవర్సీస్ విషయానికి వస్తే.. ఈ మూవీ ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో భారీగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం అమెరికా, కెనడాలో కలిపి మొత్తంగా 2.5 మిలియన్ డాలర్లు అంటే 22 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన 15వ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా మొత్తంగా 30 కోట్లకుపైగా కలెక్షన్లు నమోదు చేసింది.
క్రైమ్ అండ్ థ్రిల్లర్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన ఈ సినిమా 50 కోట్ల షేర్ కలెక్షన్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలు పెట్టింది. ఈ చిత్రం ఇప్పటికే మంచి లాభాలను నమోదు చేసుకొన్నది. నాని కెరీర్‌లో దసరా తర్వాత ఇది రెండో 100 కోట్ల చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











