Saripodhaa Sanivaaram Day 2 Box Office: సరిపోదా శనివారం వసూళ్ల శివతాండవం.. నాని మూవీకి ఎన్ని కోట్లంటే?
నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. డీవీవీ దానయ్య నిర్మాతగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా తొలి రోజు రికార్డు వసూళ్లను నమోదు చేయగా.. 2వ రోజు బాక్సాఫీస్ వద్ద పరిస్థితి ఏమిటో ఓసారి లుక్కేద్దాం..
నాని నటించిన సరిపోదా శనివారం ఆంధ్రా, నైజాంలో స్ట్రాంగ్ హోల్డ్‌తో కలెక్షన్లను సాధించింది. అంతేకాకుండా తమిళ, కన్నడ, కేరళ, హిందీ బెల్డ్‌లో కూడా మంచి రెస్పాన్స్ అందుకొన్నది. ఇక ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లు సాధించింది. దాంతో రెండో రోజు కూడా అత్యధిక వసూళ్లను అందించింది.

డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా తొలి రోజు భారీ వసూళ్లు రాబట్టింది. ఇండియాలో 9 కోట్ల రూపాయల నికర వసూళ్లను నమోదు చేసింది. తెలుగులో 16 కోట్ల గ్రాస్, తమిళంలో 75 లక్షల గ్రాస్, మలయాళంలో 40 లక్షల గ్రాస్, కన్నడలో 1.5 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. అమెరికాలో 750K డాలర్లు వసూలు చేసింది. దాంతో తొలిరోజు ఈ సినిమా సుమారుగా 24 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసిందని నిర్మాత అధికారికంగా ప్రకటించారు.
ఇక రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాం, ఆంధ్రా ప్రాంతాల్లో కలిపి 6 కోట్లు నికరంగా కలెక్షన్లను రాబట్టింది. తమిళంలో 75 లక్షల గ్రాస్, మలయాళంలో 50 లక్షల గ్రాస్, కన్నడలో 1.25 లక్షల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 6.2 కోట్ల నికరంగా 10 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. రెండో రోజు కడపటి వార్తలు అందేసరికి ఈ సినిమా 8.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం గత రెండు రోజుల్లో ఈ చిత్రం 34 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
ఇక 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రమోషనల్ ఖర్చులు, ఇతర వ్యయాలు కలుపుకొని 100 కోట్ల వరకు బడ్జెట్ అయిందనే ట్రేడ్ వర్గాల టాక్. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42 కోట్ల రూపాయల షేర్. 42 కోట్ల రూపాయల టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించిన ఈ చిత్రం వాతావరణం అనుకూలిస్తే.. తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ దాటే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











