Saripodhaa Sanivaaram Box Office: 50 కోట్లు కొల్లగొట్టిన సరిపోదా శనివారం.. 3వ రోజే లాభాలతో సరిపెట్టిన నాని
దసరా, హాయ్ నాన్న చిత్రాల వరుస విజయాల తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం. అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్వకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఎస్‌జే సూర్య, మురళీ శర్మ, ప్రియాంక అరుల్ మోహన్ నటించిన ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రం గత మూడు రోజులుగా ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
సరిపోదా శనివారం సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నప్పటికీ ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద భారీగా స్పందన కనిపిస్తున్నది. ఈ సినిమాకు ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్ బుక్ మై షోలో మంచి రెస్సాన్స్ కనిపిస్తున్నది. ఈ చిత్రం మూడో రోజు 204K టికెట్లు బుకింగ్ కావడం విశేషంగా మారింది. ఏపీ, నైజాంలో అత్యధిక వసూళ్లు సాధించింది.

సరిపోదా శనివారం సినిమాకు ఓవర్సీస్‌లో అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 1.5 మిలియన్ల వసూళ్లను సాధించింది. అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 13 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 3వ రోజు బ్రేక్ ఈవెన్ సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో నాని మూవీని ప్రేక్షకులు భారీగా ఆదరించడంతో కలెక్షన్లు కూడా అంతే మొత్తంలో వచ్చాయి. తొలి రోజు ఈ సినిమా ఏపీ, నైజాంలో 8.75 కోట్లు, రెండో రోజు 5.5 కోట్లు, మూడో రోజు 8.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 22.5 కోట్ల నికర వసూళ్లు సాధించింది.
ఇక ఇండియా వైడ్‌గా ఈ చిత్రం మెరుగైన వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం తొలి రోజున 9 కోట్ల రూపాయలు, రెండో రోజు 6 కోట్లు, మూడో రోజు 9 కోట్లకుపైగా నికర వసూళ్లను రాబట్టింది. ఇండియాలో ఈ చిత్రం 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 24 కోట్లకుపైగా వసూళ్లను సాధిస్తే.. రెండో రోజు 15 కోట్ల రూపాయలు, మూడో రోజు 13 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 50 కోట్ల మైలురాయిని దాటేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమా కలెక్షన్లు వర్షాల కారణంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











