Saripodhaa Sanivaaram Day 9 Collections: నాని మూవీకి తగ్గని కలెక్షన్లు.. సరిపోదా శనివారంకు ఎన్ని కొట్లంటే?
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన సరిపోదా శనివారం మూవీ రెండో వారంలో కూడా భారీ వసూళ్లు సాధిస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్, వరదల ప్రతికూల పరిస్థితులను ఎదురిస్తూ..ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడంతో ఈ సినిమా సక్సెస్ అయిందనే చెప్పాలి. తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీష్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌కు చేరువైంది. ఈ సినిమా గత 9 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
మదర్ సెంటిమెంట్, బస్తీలో పేదలపై పోలీస్ ఆఫీసర్ పైశాచికత్వం, అన్నదమ్ముల మధ్య ఆస్తుల కొట్లాట లాంటి పాయింట్స్‌తో రూపొందిన ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు. ఎస్‌జే సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, మురళీ శర్మ తదితరులు నటించిన ఈ సినిమాను సుమారుగా 100 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమా అంచనాలు భారీగా ఉండటంతో 42 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా 45 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

నాని నటించిన ఈ మూవీ తొలి రోజు 24 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆంధ్రా, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉన్నప్పటికీ.. రికార్డు వసూళ్లు సాధించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారీ సినిమాల పోటీ నుంచి తట్టుకొని ఈ సినిమా 8 రోజుల్లో 80 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
సరిపోదా సినిమా తొలివారం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్లకుపైగా నికర వసూళ్లు, తమిళంలో 3 కోట్లు, మలయాళంలో 1 కోటి రూపాయలు, హిందీ. ఇతర రాష్ట్రాల్లో 2 కోటి రూపాయలు వసూలు చేసింది. కన్నడలో ఈ సినిమా 6 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 8 రోజుల ఫస్ట్ వీక్‌లో 51 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఓవర్సీస్‌లో ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. నార్త్ అమెరికాలో ఈ మూవీ 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇతర దేశాలతో కలిపి ఈ సినిమా 3.5 మిలియన్ డాలర్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ఓవర్సీస్‌లో 30 కోట్లకుపైగా వసూళ్లను కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 81 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక 9వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా వసూళ్లను నమోదు చేసింది. ఈ మూవీ 1.25 కోట్ల రూపాయలు నికరంగా, 2.5 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇతర రాష్ట్రాల్లో మరో 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 84.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











