North America Collections: ఓవర్సీస్‌లో సరిపోదా శనివారం కలెక్షన్ల దుమారం.. మహేష్ బాబు రికార్డుకు చేరువగా నాని
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 29వ తేదీన రిలీజైంది. డీవీవీ దానయ్య నిర్మాతగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా సానుకూలమైన టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ సినిమా ఓవర్సీస్‌లో నమోదు చేసిన అరుదైన రికార్డు వివరాల్లోకి వెళితే..
హ్యూమన్ ఎమోషన్స్‌తోపాటు మదర్ సెంటిమెంట్, యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఓవర్సీస్‌లోభారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది.అయితే ఈ మూవీకి తొలి ఆట నుంచి హిట్ టాక్ రావడంతోపాటు ప్రీమియర్లకు మంచి రెస్సాన్స్ రావడంతో భారీగా తొలి రోజు కలెక్షన్లు నమోదు అయ్యాయి.

సరిపోదా శనివారం చిత్రం అమెరికాలో నాని కెరీర్‌లో ఓ రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా రెండు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 8.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నాని కెరీర్‌లో మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన పదో సినిమాగా ఈ చిత్రం ఘనతను సాధించింది. 2 టైప్ హీరోల్లో నేచురల్ స్టార్ టాప్‌గా నిలిచాడు.
గతంలో నాని నటించిన చిత్రాల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈగ, మారుతి దర్శకత్వంలో రూపొందిన భలే భలే మొగాడివోయ్, నేను లోకల్, నిన్ను కోరి, ఎంసీఏ, జెర్సీ, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న చిత్రాలు మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరాయి. తాజాగా సరిపోదా శనివారం మూవీ ఈ జాబితాలో చేరింది.

నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన టాలీవుడ్ హీరోల్లో నాని రెండో వ్యక్తి. గతంలో ఈ రికార్డును మహేష్ బాబు తన పేరిట నమోదు చేసుకొన్నాడు. మహేష్ బాబు కెరీర్‌లో 12 చిత్రాలు ఈ క్లబ్‌లో చేరాయి. మహేష్ బాబు తర్వాత నాని రెండో స్థానంలో నిలిచారు.


Click it and Unblock the Notifications











