Saripodhaa Sanivaaram Business రికార్డు స్థాయిలో శనివారం సరిపోదా బిజినెస్.. నాని మూవీ లాభాల్లోకి రావాలంటే?
RRR లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం సరిపోదా శనివారం. నేచురల్ స్టార్ హీరోగా, ఎస్‌జే సూర్య విలన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మలయాళ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు. ఆగస్టు 29వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ మూవీ బిజినెస్ వివరాల్లోకి వెళితే..
అంటే సుందరానికి సినిమా ఫ్లాప్ తర్వాత నాని, వివేక్ ఆత్రేయ మరోసారి హిట్ కొట్టేందుకు జతకట్టారు. యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్, మదర్ సెంటిమెంట్ అంశాలతో సాగే ఈ మూవీని సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమాకు భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

సరిపోదా శనివారం సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అయితే తెలుగు, తమిళంలో అత్యధిక సంఖ్యలో, హిందీ, కన్నడ, మలయాళంలో తక్కువ స్క్రీన్లతో మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ను ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చిలో భారీగా చేశారు.
ఇక మూవీ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యాన్సీ రేటుకు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకొన్నారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఒపెన్ అయిన వెంటనే మంచి స్పందన కనిపిస్తున్నది.
ఇక సరిపోదా శనివారం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నాని కెరీర్‌లో బెస్ట్ ధర పలికిందని చెబుతున్నారు. నైజాం హక్కులు 12 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 5.4 కోట్లు, వైజాగ్ హక్కులు 3 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లా హక్కులు 2.4 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా హక్కులు 1.44 కోట్లు, కృష్ణా జిల్లా హక్కులు 1.8 కోట్లు, గుంటూరు జిల్లా హక్కులు 2.4 కోట్ల హక్కులు, నెల్లూరు జిల్లా హక్కులు 96 లక్షల మేర బిజినెస్ జరిగింది.

నటీనటులు: నాని, ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్‌జే సూర్య, సాయికుమార్ తదితరులు
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి
బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫి: మురళీ జీ
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
రిలీజ్ డేట్: 2024-08-27


Click it and Unblock the Notifications











