సరిపోదా శనివారం కలెక్షన్ల భీభత్సం.. 100 కోట్లపై కన్నేసిన నాని.. 5వ రోజు రికార్డు స్థాయిలో ఎన్ని కోట్లంటే?

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన పరిస్థితుల్లో కూడా నాని నటించిన సరిపోదా శనివారం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్లను రాబడుతున్నది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాతగా రూపొందిన ఈ సినిమా ఇప్పటికే పలు చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించి.. అత్యధికంగా లాభాలను పంచి పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఈ సినిమా 5వ రోజు కలెక్ష్లన్ల వివరాల్లోకి వెళితే.

అంటే సుందరానికి తర్వాత వివేక్ ఆత్రేయ తన శైలికి భిన్నంగ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ సూపర్ స్టార్ ఎస్‌జే సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, మురళీ శర్మ తదితరులు నటించిన ఈ సినిమాను సుమారుగా 100 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సుమారుగా 42 కోట్ల రూపాయల షేర్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

Saripodhaa Sanivaaram Worldwide Box Office Nani Movie racing towards 100 Crores Collections

నేచురల్ స్టార్ నాని నటించిన ఈ చిత్రం తొలి రోజు నుంచే రికార్డు వసూళ్లు రాబడుతున్నది. ఈ చిత్రం తొలి రోజే 24.2 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. ఇక రెండో రోజు అదే జోష్‌ను కొనసాగించి 11 కోట్ల గ్రాస్, మూడో రోజు 15 కోట్ల రూపాయల గ్రాస్, 4వ రోజు మరో 15 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది.

ఇక ఆంధ్రా, నైజాంల ఈ సినిమా భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను కుమ్మేసింది. నాని స్టామినాను గుర్తు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 1వ రోజు 9 కోట్ల రూపాయలు, 2వ రోజు 5.5 కోట్ల రూపాయలు, 3వ రోజ 9.2 కోట్ల రూపాయలు, 4వ రోజు 9.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే దాదాపు 34 కోట్ల రూపాయలు రాబట్టింది.

సరిపోదా శనివారం మూవీ గత 4 రోజుల్లో ఈ చిత్రం రికార్డు వసూళ్లు నమోదు చేసింది. ఆంధ్రా, నైజాంలో 34 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 5.5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 4 కోట్ల రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఇండియాలో 45 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

Saripodhaa Sanivaaram Worldwide Box Office Nani Movie racing towards 100 Crores Collections

ఇక ఓవర్సీస్‌‌లో సరిపోదా శనివారం అత్యధికంగా ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఈ చిత్రం గత 4 రోజుల్లో 2.5 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 20 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో వరద భీభత్సాన్ని తట్టుకొని రికార్డు వసూళ్లను 5వ రోజున రాబట్టింది. ఈ చిత్రం తెలుగులో 3.5 కోట్ల రూపాయలు, తమిళంలో 50 లక్షలు, కన్నడలో 1 కోటి రూపాయలు, మలయాళంలో 40 లక్షలు, హిందీలో 10 లక్షలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో మరో 50 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 5.4 కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్‌గా వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 70 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X