100 కోట్లకు చేరువగా సరిపోదా శనివారం.. 6వ రోజు నాని మూవీకి ఎన్ని కోట్లంటే?
తుఫాన్, వరద పరిస్థితుల మధ్య నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం చిత్రం తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా వసూళ్లను రాబడుతున్నది. అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఎస్‌జే సూర్య, మురళీ శర్మ, ప్రియాంక అరుల్ మోహన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం గత 6 రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందన వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదురించి సరిపోదా చిత్రం భారీ వసూళ్లు సాధిస్తున్నది. ఈ మూవీ తొలి రోజు 9 కోట్లు నికరంగా, 2వ రోజు 6 కోట్ల రూపాయలు, 3వారం 9 కోట్ల రూపాయలు, 4వ రోజు 9.5 కోట్లు, 5వ రోజు 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 37 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మొదటి రోజు 8.75 కోట్ల రూపాయలు, 2వ రోజు 5.5 కోట్ల రూపాయలు, 3వ రోజు 8.5 కోట్లు, 4వ రోజు 8.75 కోట్లు, 5వ రోజు 3 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 34 కోట్ల రూపాయలు నికరంగా వసూళ్లు సాధించింది.
అలాగే, తెలుగేతర రాష్ట్రాల్లో వసూళ్ల వివరాల్లోకి వెళితే.. కన్నడలో 5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 3.5 కోట్ల రూపాయలు, కేరళలో 50 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో 1.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 10.6 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద రాబట్టింది.
సరిపోదా శనివారం చిత్రం 6వ రోజు కూడా నిలకడగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ఇండియా వైడ్‌గా 3.2 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక తమిళంలో 20 లక్షల రూపాయలు, కన్నడలో 50 లక్షలు, ఇతర ప్రాంతాల్లో 20 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 3.2 కోట్లతో ఇండియాలో మొత్తంగా 40 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

అలాగే ఓవర్సీస్‌లో కూడా నాని మూవీకి మంచి ఆదరణ దక్కుతున్నది. నార్త్ అమెరికాలో గత 5 రోజుల్లో 2 మిలియన్ డాలర్లతో సుమారుగా 17.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మిగితా దేశాల్లో ఈ చిత్రం మొత్తంగా 3 మిలియన్ డాలర్లు రాబట్టింది. దాంతో ఓవర్సీస్‌లో ఈ చిత్రం 27 కోట్ల రూపాయలు వరకు కెక్ట్ చేసింది.
సరిపోదా శనివారం సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం 80 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా రెండోవారంలో 100 కోట్ల మైలురాయిని అధిగమించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ఇప్పటికే పలు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ సాధించగా.. బిజినెస్ పరంగా 80 శాతం రికవరీని సాధించిందని తెలిపారు.


Click it and Unblock the Notifications











