Sarkaaru Noukari Closing Collections సింగర్ సునీత కొడుకు మూవీకి ఎంత నష్టం? రాఘవేంద్రరావు కెరీర్‌లోనే దారుణంగా!

ప్రఖ్యాత దర్శకుడు కే రాఘవేంద్రరావు నిర్మాతగా గంగనమోనీ శేఖర్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిన చిత్రం సర్కారు నౌకరి. ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ గోపరాజును హీరోగా పరిచయం చేస్తూ సమాజాన్ని ఆలోచింపజేసే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. భావన వజపండాల్, తనికెళ్ల భరణి,మణి చందన, సమ్మెట గాంధీ, శ్రీనివాసరావు తదితరులు నటించిన ఈ చిత్రం జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? బిజినెస్ వ్యాల్యూ ఎంత? కలెక్షన్లు ఎంత వచ్చాయనే వివరాల్లోకి వెళితే..

హెల్త్ అసిస్టెంట్‌గా సర్కారు నౌకరి ఉద్యోగాన్ని సంపాదించిన ఓ యువకుడు ఓ గ్రామంలో ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అతడి వ్యక్తిగత, దాంపత్య జీవితంలో సమస్యలు తీవ్రంగా మారుతాయి. లైంగిక సబంధాల ద్వారా వచ్చే అంటు వ్యాధులు, ప్రాణాంతక వ్యాధులను నివారించేందుకు నిరోధ్ వాడమని అడగడం వల్ల అతడిని ఎలా ఈసడించుకొన్నారు. ఈ అవమానాలను భరించి ఏం సాధించాడనేది ఈ సినిమా కథ.

Sarkaaru Noukari Closing Collections: Biggest Flop in K Raghvavendra Rao Career

సర్కారు నౌకరి సినిమా కథను బలంగా ప్రేక్షకులకు చెప్పాలనే తపనతో ఎలాంటి రాజీ పడకుండా భారీగానే ఖర్చు పెట్టారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్, ఇతర ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 4 కోట్ల రూపాయలతో తెరకెక్కించినట్టు తెలిసింది. ఈ సినిమాను సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 500 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 100 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

సర్కారు నౌకరి సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులపై ప్రభావం చూపించలేకపోయింది. న్యూ ఇయర్ కావడం, అప్పటికే రిలీజైన రెండు భారీ సినిమాలకు క్రేజ్ తగ్గకుండా, బలంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధించడంతో ఈ సినిమా అంతగా ఆడియెన్స్ థియేటర్‌కు రప్పించలేకపోయింది. రాంగ్ టైమ్‌లో రిలీజ్ చేశారనే విషయం ట్రేడ్ వర్గాల్లో వినిపించింది.

Sarkaaru Noukari Closing Collections: Biggest Flop in K Raghvavendra Rao Career

దాంతో సర్కారు నౌకరి చిత్రం పేలవంగా కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం తొలి రోజు 6 లక్షలు, రెండో రోజు 3 లక్షలు, మూడో రోజు 2 లక్షలు, నాలుగో రోజు 2 లక్షలు, ఐదో రోజు 2 లక్షలు, ఆరో రోజు 2 1.5 లక్షలు, ఏడో రోజు 1 లక్షల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా తొలివారం ఈ సినిమా 17.5 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది.

సర్కారు నౌకరీ చిత్రం బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ సినిమా 3 కోట్ల టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ఇక ఈ సినిమా కేవలం 17.5 లక్షలు రాబట్టడంతో భారీగా నష్టాల్లో ముగిసింది. రాఘవేంద్రరావు కెరీర్‌లోనే అత్యంత దారుణంగా వసూళ్లు సాధించిన చిత్రంగా మిగిలిపోయింది. థియేట్రికల్‌గా దాదాపు మొత్తానికి మొత్తం నష్టాల్లోనే ముగిసింది. నాన్ థియేట్రికల్‌గా కొంత మేరకు నష్టాల్ని పూడ్చే మొత్తం వచ్చిందని చెప్పుకొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X