ఓవర్సీస్‌లో దుమ్మురేపుతున్న ‘సర్కార్’... ఫస్ట్ వీకెండ్ షాకింగ్ కలెక్షన్స్!

విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కార్' చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. ఆదివారంతో ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో ఏకంగా 8 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.

2018లో వచ్చిన అతిపెద్ద తమిళ చిత్రాల్లో 'సర్కార్' ఒకటి. విజయ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా బడ్జెట్ విషయంలో, ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ వారు తెరకెక్కించారు. సినిమాపై భారీ హైప్ రావడంతో థియేట్రికల్ రైట్స్ సైతం ఎక్కువ రేటుకు అమ్ముడయ్యాయి.

ఓవర్సీస్ గ్రాండ్ రిలీజ్

ఓవర్సీస్ గ్రాండ్ రిలీజ్

ఈ చిత్రాన్ని అమెరికాతో పాటు యూకె, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ తదితర దేశాల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. అన్ని దేశాల్లో కలిపి దాదాపు 500 స్క్కీన్లలో ప్రదర్శించారు. ఓవర్సీస్ మార్కెట్లో తొలి రోజే రూ. 9.50 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

 వసూళ్లు అదరగొట్టింది

వసూళ్లు అదరగొట్టింది

పొలిటికల్ ఎంటర్టెనర్‌గా రూపొందిన ‘సర్కార్' సెకండాఫ్ యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్ల పరంగా దూసుకెళుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

ఓవర్సీస్ రూ. 60 కోట్లు

ఓవర్సీస్ రూ. 60 కోట్లు

కేవలం ఓవర్సీస్ మార్కెట్లోనే సర్కార్ $8,223,120 (రూ. 60 కోట్ల) గ్రాస్ వసూలు చేసింది. ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 26 కోట్ల మేర వచ్చినట్లు సమాచారం. తొలి వారాంతంలోనే 88 శాతం పెట్టుబడి రికవరీ అయింది.

 రూ. 300 కోట్ల ఖాయమేనా?

రూ. 300 కోట్ల ఖాయమేనా?

ఇప్పటికే వసూళ్ల పరంగా డబల్ సెంచరీ క్రాస్ చేసిన ‘సర్కార్' మూవీ ఫుల్ రన్‌లో రూ. 300 కోట్ల మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. విజయ్ కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్లలో ‘సర్కార్' టాప్ లిస్టులో చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X