బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న సర్కార్.. 200 కోట్లపై గురి.. విజయ్ ఖాతాలో అరుదైన రికారు!

తమిళ సూపర్‌స్టార్ విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ మురగదాస్ కాంబినేషన్‌లో విడుదలైన సర్కార్ చిత్రం వివాదాలను ఎదురిస్తూ దూసుకెళ్తున్నది. మిశ్రమ స్పందన వ్యక్తమైనా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దుమ్మురేపుతున్నది. తొలివారంలోనే రూ.200 కోట్ల క్లబ్‌వైపు దూసుకెళ్తున్నది. అంతేకాకుండా విజయ్ కెరీర్‌లోనే ఘనమైన రికార్డులను సొంతం చేసుకొంటూ భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. వివరాల్లోకి వెళితే

నాలుగు రోజుల్లోనే

నాలుగు రోజుల్లోనే

భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ భాషల్లో సర్కార్ చిత్రం రిలీజైంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ.150 కోట్ల మార్కును దాటేసింది. అంతేకాకుండా రూ.200 కోట్ల క్లబ్‌పై కన్నేసింది. మరో రెండు మూడు రోజుల్లో ఈ చిత్రం ఆ మార్కును దాటే పరిస్థితి కనిపిస్తున్నది.

 విజయ్ ఖాతాలో అరుదైన

విజయ్ ఖాతాలో అరుదైన

సర్కార్ సినిమాతో విజయ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ఇప్పటి వరకు మూడుసార్లు రూ.150 కోట్లు దాటిన హీరోగా సరికొత్త ఘనతను సొంతం చేసుకొన్నాడు. విజయ్ నటించిన తెరీ, మెర్సల్ ఈ ఘనతను సాధించాయి.

చెన్నైలో దూసుకెళ్తున్న

చెన్నైలో దూసుకెళ్తున్న

ఇక చెన్నైలో కూడా సర్కార్ చిత్రం దూసుకెళ్తున్నది. శుక్రవారం రోజున ఈ సినిమా రూ.1.36 కోట్లు సాధించింది. గత నాలుగు రోజుల్లో చెన్నైలోనే ఈ చిత్రం రూ.7.33 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఆదివారం నాటికి ఈ చిత్రం రూ.10 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించే అవకాశం లేకపోలేదు.

 ఓవర్సీస్ మార్కెట్‌లోనూ

ఓవర్సీస్ మార్కెట్‌లోనూ

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సర్కార్ చిత్రం బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం 650కే డాలర్లకుపైగా వసూళ్లను సాధించింది. మెర్సల్ చిత్రం తర్వాత విజయ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది.

 సర్కార్‌పై అన్నాడీఎంకే కన్నెర్ర

సర్కార్‌పై అన్నాడీఎంకే కన్నెర్ర

విజయ్‌తోపాటు కీర్తీ సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన ఈ చిత్రం విడుదల తర్వాత తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే నుంచి అనేక అభ్యంతరాలను ఎదుర్కొన్నది. కొన్ని సీన్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో వాటిని తొలగించి ప్రదర్శిస్తున్నారు. ఎన్ని వివాదాలు ఎదురైనా సినిమా వసూళ్లు తగ్గకపోవడంపై సినీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X