twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సర్కార్’ ప్రీ రిలీజ్ బిజినెస్ మైండ్ బ్లోయింగ్: ఇప్పటికే రూ. 185 కోట్లు...

    |

    తమిళ స్టార్ విజయ్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన 'సర్కార్' చిత్రం దీపావళి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుద చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బేనర్లో కళానిధి మారన్ నిర్మించిన ఈచిత్రం విడుదల ముందే రికార్డు స్థాయి బిజినెస్ జరుగడం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది.

    ఆ ఏరియా రైట్స్ ఇవ్వలేదని.... స్టార్ హీరో సినిమాపై ప్రతీకారం!ఆ ఏరియా రైట్స్ ఇవ్వలేదని.... స్టార్ హీరో సినిమాపై ప్రతీకారం!

    వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇలా అన్ని రైట్స్ కలిపి దాదాపు రూ. 185 కోట్లకుపైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఒక్క తమిళనాడులోనే థియేట్రికల్ రైట్స్ రూ. 81 కోట్లకు అమ్ముడవ్వడం విశేషం. ఇక సినిమా రిలీజైన తర్వాత రికార్డుల మోత ఏ స్థాయిలో ఉంటుందో? అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ఇండియా వైడ్ థియేట్రికల్ రైట్స్

    ఇండియా వైడ్ థియేట్రికల్ రైట్స్

    విజయ్ సినిమాలకు తమిళనాడులో భారీ క్రేజ్ ఉన్న నేపథ్యంలో... అక్కడ రికార్డు స్థాయిలో రూ. 81 కోట్ల బిజినెస్ జరిగింది. ఇతర రాష్ట్రాలన్నింటికీ కలిపి ఇండియా వైడ్ టోటల్ రూ. 105.6 కోట్లకు రైట్స్ అమ్మారు.

    తెలుగు, కన్నడ రైట్స్

    తెలుగు, కన్నడ రైట్స్

    తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడనాట కూడా రైట్స్ మంచి ధరకు అమ్ముడయ్యాయి. కర్నాటకలో రూ. 8 కోట్లకు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.5 కోట్లకు రైట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది. రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 1 కోటికి అమ్మినట్లు సమాచారం.

    ఓవర్సీస్ ‘సర్కార్' బిజినెస్ సూపర్

    ఓవర్సీస్ ‘సర్కార్' బిజినెస్ సూపర్

    తమిళులు ఇతర దేశాల్లోనూ ఎక్కువ సంఖ్యలో సెటిలవ్వడంతో ఓవర్సీస్ బిజినెస్ కూడా అదిరిపోయింది. సౌత్ ఈస్ట్ ఏషియా రూ. 11 కోట్లు, నార్త్ అమెరికా రూ. 5.5 కోట్లు, యూఏఈ రూ. 5 కోట్లు, యూరఫ్ రూ. 4.1 కోట్లు, శ్రీలంక రూ. 2 కోట్లు, రెస్టాఫ్ వరల్డ్ రూ. 2.4 కోట్లకు అమ్ముడయ్యాయి.

     వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 135 కోట్లు

    వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 135 కోట్లు

    ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో థియేట్రికల్ రైట్స్ కలిపి టోటల్ బిజినెస్ రూ. 135 కోట్లకు చేరుకుంది. విజయ్ కెరీర్లోనే ఇదే హయ్యెస్ట్ థియేట్రికల్ బిజినెస్ అని అంటున్నారు ట్రేవడ్ విశ్లేషకులు.

    మరో రూ. 50 కోట్లు అదనం

    మరో రూ. 50 కోట్లు అదనం

    హిందీ డబ్బింగ్ రైట్స్, బ్రాడ్ కాస్టింగ్, శాటిలైట్ రైట్స్ ఇలా అన్నీ కలిపి మరో రూ. 50 కోట్ల అదనపు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా సర్కార్ మూవీ విడుదల ముందే రూ. 185 కోట్ల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

     గ్రాండ్ రిలీజ్

    గ్రాండ్ రిలీజ్

    దీపావళి సందర్భంగా నవంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా ‘సర్కార్' మూవీ దాదాపు రూ. 3 వేలకు పైగా స్క్రీన్లలో భారీగా విడుదల కాబోతోంది. తొలి రోజు ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయో అనే ఆసక్తి అందిరిలోనూ నెలకొంది.

    English summary
    Vijay's upcoming film Sarkar has done a record-breaking pre-release business.A rough estimation from the trade says that Sarkar has minted over Rs 185.6 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X