Don't Miss!
- News
ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్ని గ్రామస్తులు: ఒకరు మాజీ బీజేపీ మైనార్టీ నేత, రూ. 5 లక్షల రివార్డ్
- Sports
బుమ్రాకు బ్యాటింగ్ నేర్పించింది నేనే: సంజనా గణేశన్
- Finance
Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?
- Technology
BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 03 నుండి జూలై 9వ తేదీ వరకు..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
SVP 10 Days Collections: తగ్గినట్టే తగ్గి పెరిగిన కలెక్షన్లు.. హిట్ కొట్టాలంటే ఇంకెంత రావాలంటే!
సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ అందుకున్న ఆయన అదే ఉత్సాహంతోనే ఇటీవల 'సర్కారు వారి పాట' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ముందు మిశ్రమ స్పందన అందుకున్నా ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణను అందుకుంటోంది. ఈ క్రమంలోనే అద్బుతమైన కలెక్షన్లను రాబడుతోంది. అయితే, కొద్ది రోజుల నుంచి ఈ మూవీ కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'సర్కారు వారి పాట' మూవీ 10 రోజుల్లో ఎంత రాబట్టిందో కలెక్షన్స్ రిపోర్ట్ మీద ఒక కన్నేద్దాం పదండి!

భారీ అంచనాలతో
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకేక్కిన్చిన్ ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. బ్యాంకింగ్ మోసాల నేపధ్యంలో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు.

10 వ రోజు
ఈ సినిమాలో ఇందులో సముద్రఖని ప్రతినాయకుడిగా నటించగా వెన్నెల కిషోర్, సౌమ్య మీనన్, తనికెళ్ళ భరణి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే 'సర్కారు వారి పాట'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10వ రోజు కలెక్షన్స్ కొంత పెరిగాయి. దీంతో నైజాంలో రూ. 54 లక్షలు, సీడెడ్‌లో రూ. 29 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 27 లక్షలు, ఈస్ట్‌లో రూ. 16 లక్షలు, వెస్ట్‌లో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరు రూ. 5 లక్షలతో కలిపి రూ. 1.58 కోట్లు షేర్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలు చేసింది?
10 రోజులకు కలిపి ఏపీ, తెలంగాణలో 'సర్కారు వారి పాట' బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 31.43 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.71 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 11.53 కోట్లు, ఈస్ట్‌లో రూ. 7.94 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.18 కోట్లు, గుంటూరులో రూ. 8.23 కోట్లు, కృష్ణాలో రూ. 5.41 కోట్లు, నెల్లూరులో రూ. 3.24 కోట్లతో కలిపి రూ. 83.67 కోట్లు షేర్, రూ. 125.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.

10 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో రూ. 83.67 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన 'సర్కారు వారి పాట'.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగా రాణించింది. ఫలితంగా కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.10 కోట్లు, ఓవర్సీస్లో రూ. 11.85 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 10 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 101.62 కోట్లు షేర్‌తో పాటు రూ. 162.40 కోట్ల గ్రాస్ వచ్చింది.

హిట్ కొట్టాలంటే?
ఇక మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 121 కోట్లుగా నమోదైంది. 10 రోజుల్లో రూ. 101.6 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 19.38 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్ సొంతం చేసుకుంటుంది.