Sarkaru Vaari Paata 11 Days Collections: సండే మరో మ్యాజిక్ నెంబర్.. కానీ దెబ్బ పడేలా ఉంది?

సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనే విధంగా ఒపెనింగ్స్ అయితే అందుకుంది. అయితే రోజులు గడిచిన కొద్ది కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ కాస్త తగ్గుతూ వస్తున్నాయి. తప్పకుండా 'సర్కారు వారి పాట' సినిమా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేసింది. ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్స్ తో కూడా మరోసారి హైలెట్ గా నిలిచింది. 'సర్కారు వారి పాట' సినిమా మొత్తంగా పదకొండవ రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది? టార్గెట్ పూర్తి కావాలి అంటే ఇంకా ఎంత రావాలి అనే వివరాల్లోకి వెళితే..

మహేష్ రేంజ్ కు తగ్గట్టుగా బిజినెస్

మహేష్ రేంజ్ కు తగ్గట్టుగా బిజినెస్

పరశురామ్ దర్శకత్వం వహించిన 'సర్కారు వారి పాట' సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అలాగే 14రీల్స్ కూడా సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు GMB కూడా ఈ సినిమా బిజినెస్ లో ఒక పార్ట్నర్ గా కొనసాగింది. మహేష్ బాబు రేంజ్ కు తగ్గట్టుగా 'సర్కారు వారి పాట' సినిమా బాక్సాఫీస్ వద్ద 120 కోట్ల వరకు బిజినెస్ చేసింది. దీంతో 121 కోట్ల టార్గెట్ గా మార్కెట్ లోకి అడుగు పెట్టింది.

11వ రోజు వచ్చిన కలెక్షన్స్

11వ రోజు వచ్చిన కలెక్షన్స్

అయితే 'సర్కారు వారి పాట' సినిమా మొదటివారం బాగానే కలెక్షన్స్ అందుకుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి డౌన్ అయిపోయింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజు వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 78 లక్షలు, సీడెడ్‌లో రూ. 36 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 24 లక్షలు, ఈస్ట్‌లో రూ. 24 లక్షలు, వెస్ట్‌లో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, నెల్లూరు రూ. 10 లక్షలతో కలిపి ఏపీ తెలంగాణలో రూ. 2.40 కోట్లు షేర్ వచ్చింది.

 ఏపీ తెలంగాణ వచ్చిన టోటల్ కలెక్షన్స్

ఏపీ తెలంగాణ వచ్చిన టోటల్ కలెక్షన్స్

టోటల్ గా 11 రోజులలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 'సర్కారు వారి పాట'కు వచ్చిన కలెక్షన్స్ ఏరియాల వారిగా చూసుకుంటే.. నైజాంలో రూ. 32.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.07 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 11.49 కోట్లు, ఈస్ట్‌లో రూ. 8.18 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.38 కోట్లు, గుంటూరులో రూ. 8.34 కోట్లు, కృష్ణాలో రూ. 5.61 కోట్లు, నెల్లూరులో రూ. 3.34 కోట్లు రాగా టోటల్ గా రూ. 86.07 కోట్లు షేర్, రూ. 129.15 కోట్లు గ్రాస్‌ వచ్చింది.

 ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్

తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో రూ. 86.07 కోట్లు షేర్ రాబట్టిన 'సర్కారు వారి పాట'.. మిగిలిన ప్రాంతాల్లో కూడా బాగానే వసూలు చేసింది. అయితే కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.51 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.10 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా వరల్డ్ వైడ్ 11 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 104.62 కోట్లు షేర్‌, రూ. 167.80 కోట్ల గ్రాస్ వచ్చింది.

 ఇంకా ఎంత రావాలంటే..?

ఇంకా ఎంత రావాలంటే..?

ఇక ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ కూడా ఇంకా 'సర్కారు వారి పాట'కు రావాల్సిన బాకీ చాలానే ఉంది. 120 కోట్ల రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా కూడా 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల అయింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 104.62 కోట్ల షేర్ వచ్చింది కాబట్టి సక్సెస్ కావాలంటే ఇంకా 16.32 కోట్ల షేర్ చేయాల్సి ఉంది. మరి ఈ వారం లో సినిమా ఆ టార్గెట్ ను ఫినిష్ చేస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X