Sarkaru Vaari Paata 12 Days Collections: మళ్ళీ ఊహించని షాక్.. ఆ స్థాయిలో నష్టాలు తప్పేలా లేవు?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత సర్కారు వారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి వీకెండ్లో భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత మెల్లగా కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. అయినప్పటికీ కూడా మహేష్ బాబు తన స్టార్ ఇమేజ్ తో 100కోట్ల షేర్ అందుకునే వరకు నడిపించుకుంటూ వచ్చాడు అనే చెప్పాలి. ఇక ఈ సినిమా 12 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది నష్టాల బారిన పడకుండా ఉండాలి అంటే ఇంకా ఎంత రావాలి అని వివరాల్లోకి వెళితే..

బ్రేక్ ఈవెన్ టార్గెట్..

బ్రేక్ ఈవెన్ టార్గెట్..


గీత గోవిందం సినిమా తర్వాత మహేష్ బాబుతో పరశురామ్ సినిమా చేస్తున్నాడు అనగానే అభిమానులలో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. తప్పకుండా మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయని ఊహించుకున్నారు. ఆ క్రేజ్ తోనే ఈ సినిమాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే కొనసాగింది. ఇక సినిమా 120 కోట్ల వరకు బిజినెస్ చేసింది. దీంతో 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సర్కారు వారి పాట మార్కెట్ లోకి అడుగు పెట్టింది.

 12వ రోజు వచ్చిన కలెక్షన్స్

12వ రోజు వచ్చిన కలెక్షన్స్


'సర్కారు వారి పాట' సినిమా ఓపెనింగ్స్ కలెక్షన్స్ తో నిర్మాతలకు ధైర్యం ఇచ్చింది. కానీ కాస్త డివైడ్ టాక్ రావడం, టికెట్ల రేట్లు ఎక్కువగా ఉండడం మైనస్ అయ్యిందనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజు వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, ఈస్ట్‌లో రూ. 10 లక్షలు, వెస్ట్‌లో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరు రూ. 4 లక్షలతో కలిపి మొత్తంగా ఏపీ తెలంగాణలో 0.86 కోట్లు షేర్ వసూళ్లను అందుకుంది.

 ఏపీ తెలంగాణ మొత్తం కలెక్షన్స్

ఏపీ తెలంగాణ మొత్తం కలెక్షన్స్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'సర్కారు వారి పాట'కు టోటల్ గా 12 రోజులలో వచ్చిన కలెక్షన్స్ ఏరియాల వారిగా ఈ విధంగా ఉన్నాయి.. నైజాంలో రూ. 32.47 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.21 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.09 కోట్లు, ఈస్ట్‌లో రూ. 8.28 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.45 కోట్లు, గుంటూరులో రూ. 8.38 కోట్లు, కృష్ణాలో రూ. 5.67 కోట్లు, నెల్లూరులో రూ. 3.38 కోట్లు రాగా టోటల్ గా రూ. 86.93 కోట్లు షేర్, రూ. 130.60 కోట్లు గ్రాస్‌ వచ్చింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్

వరల్డ్ వైడ్ కలెక్షన్స్

ఏపీ తెలంగాణలో 12 రోజుల్లో రూ. 86.93 కోట్లు షేర్ రాబట్టిన 'సర్కారు వారి పాట'.. మిగిలిన ప్రాంతాల్లో మంచి వసూళ్లను సాధించింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.58 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.18 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా వరల్డ్ వైడ్ చూసుకుంటే 11 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 105.69 కోట్లు షేర్‌, రూ. 169.60 కోట్ల గ్రాస్ వచ్చింది.

 లాభాల్లోకి రావాలంటే..?

లాభాల్లోకి రావాలంటే..?


సర్కారు వారి పాట సినిమా ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ఒక రికార్డ్ అయినప్పటికీ లాభాల్లోకి రావాలి అంటే ఇంకా రావాల్సింది చాలానే ఉంది. మొత్తంగా 120 కోట్ల రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా కూడా 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల అయింది. వరల్డ్ వైడ్ గా నిన్నటితో 105.69 కోట్ల షేర్ వచ్చింది. కాబట్టి నష్టాల బారిన పడకుండా ఉండాలి అంటే ఇంకా 15.31 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ వారం ఆ టార్గెట్ అందుకునే అవకాశం అయితే లేదు. పోటీగా F3 వస్తోన్న విషయం తెలిసిందే. చూస్తుంటే సర్కారు వారి పాట 10 నుంచి 13 కోట్ల మధ్యలో నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X