Sarkaru Vaari Paata 13 Days Collections: అలసిపోయిన మహేష్.. మంగళవారం మరో దెబ్బ!
మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ గట్టిగానే అందుకున్నప్పటికీ ఆ తర్వాత కలెక్షన్స్ అయితే ఒక్కసారిగా తగ్గి పోయిన విషయం తెలిసిందే. అసలు ఈ సినిమా 100 కోట్ల షేర్ వసూళ్లను అందుకుంటుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ మహేష్ బాబు కేవలం తన స్టార్ హోదాతోనే ఇక్కడి వరకు తీసుకు వచ్చాడు అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా 13వ రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది.. సక్సెస్ కావాలి అంటే ఇంకా ఎంత రావాలి.. అనే వివరాల్లోకి వెళితే..

ఆ విధంగా బిజినెస్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో ఇష్టంగా చేసిన సర్కారు వారి పాట సినిమా ప్రేక్షకులను మాత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో వీకెండ్స్ అనంతరం సినిమా కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. అయితే విడుదలకు ముందు ఈ సినిమా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడం తో బిజినెస్ గట్టిగానే జరిగింది.
సర్కారు వారి పాట సినిమా 120 కోట్ల వరకు బిజినెస్ చేసింది. దీంతో 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సర్కారు వారి పాట మార్కెట్ లోకి అడుగు పెట్టింది.

13వ రోజు వచ్చిన కలెక్షన్స్
అయితే 'సర్కారు వారి పాట'కు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ వీకెండ్స్ లో అయితే బాగానే వచ్చాయి. ఇక టికెట్ల రేట్లు తగ్గించడం కూడా సినిమాకి కాస్త హెల్ప్ అయ్యింది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 13వ రోజు వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరు రూ. 2 లక్షలతో కలిపి మొత్తంగా రెండు స్టేట్స్ లో 0.50 కోట్లు షేర్ వసూళ్లను అందుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన టోటల్ కలెక్షన్స్
'సర్కారు వారి పాట'కు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 13 రోజులకు గాను వచ్చిన టోటల్ ఏరియాల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.. నైజాంలో రూ. 32.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.28 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.17 కోట్లు, ఈస్ట్‌లో రూ. 8.33 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.49 కోట్లు, గుంటూరులో రూ. 8.40 కోట్లు, కృష్ణాలో రూ. 5.71 కోట్లు, నెల్లూరులో రూ. 3.40 కోట్లు రాగా టోటల్ గా రూ. 87.43 కోట్లు షేర్, రూ. 131.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్
ఏపీ తెలంగాణలో 13 రోజుల్లో రూ. 87.43 కోట్లు షేర్ రాబట్టిన 'సర్కారు వారి పాట'.. మిగిలిన ప్రాంతాల్లో మంచి వసూళ్లను సాధించింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.62 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.25 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా వరల్డ్ వైడ్ చూసుకుంటే 11 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 106.30 కోట్లు షేర్, రూ. 170.65 కోట్ల గ్రాస్ వచ్చింది.

నష్టపోకుండా ఉండాలంటే..
సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ వీక్ లో తప్పితే ఆ తరువాత ఒక్కసారిగా కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. సినిమా బిజినెస్ ను బట్టి చూస్తే కాస్త నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల అయింది. ఇక వరల్డ్ వైడ్ గా 13వ రోజు 106.30 కోట్ల షేర్ వచ్చింది. ఇక నష్టాల బారిన పడకుండా ఉండాలి అంటే ఇంకా 14.70 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











