Don't Miss!
- News
తెలంగాణాలో బీజేపీ దూకుడు; మళ్ళీ రంగంలోకి కేంద్ర మంత్రులు.. ఈసారి ప్లాన్ ఇదే!!
- Technology
Oppo కొత్త ఫోన్ల లాంచ్ డేట్ వచ్చేసింది ! ఈ ఫోన్ల ధర మరియు ఫీచర్లు చూడండి.
- Sports
Wimbledon 2022: సెమీస్‌లో ఓడిన సానియా జోడీ.. మ్యాచ్‌కు హాజరైన ధోనీ!
- Finance
Fuel Prices: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు: 100 డాలర్ల దిగువకు క్రూడ్
- Lifestyle
Today Rasi Phalalu :ఈ రోజు మీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయి, తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉందా?
- Automobiles
టీవీఎస్ నుంచి కొత్త బైక్ 'రోనిన్' వచ్చేసింది: ధర రూ. 1.49 లక్షలు
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు..!
Sarkaru Vaari Paata 15 Days Collections: మహేష్ బాబు సేఫ్ గేమ్ ఆడినప్పటికి.. నష్టాలు తప్పట్లేదు!
కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్కారు వారి పాట సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. పెద్దగా ప్రయోగాలకు వెళ్ళకుండా మహేష్ ఈ సినిమాతో మినిమమ్ హిట్ కొట్టాలని అనుకున్నాడు. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో ప్రాఫిట్స్ లోకి రాలేకపోతొంది. రెండవ వారం పూర్తిగా కలెక్షన్స్ తగ్గిపోయాయి. మొత్తానికి మహేష్ బాబు తన స్టార్ హోదా తో సినిమాను 100 కోట్ల షేర్ ను అందించాడు. మరికొంత దూకుడుగా వెళ్లి ఉంటే సినిమా ప్రాఫిట్స్ లోకి వచ్చేది. ఇక 15వ రోజు ఎంత కలెక్షన్స్ వచ్చాయి? ఏ రేంజ్ లో వచ్చాయనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి సారి పరశురామ్ దర్శకత్వంలో నటించడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై మంచి డిమాండ్ ఏర్పడింది. దానికి తోడు తమన్ సంగీతం అందించడం హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించడం ఇలా అన్ని రకాలుగా టీం సెట్ అవడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీంతో మంచి బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమా 120 కోట్ల వరకు బిజినెస్ చేసింది. దీంతో 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సర్కారు వారి పాట మార్కెట్ లోకి అడుగు పెట్టింది.

15వ రోజు వచ్చిన కలెక్షన్స్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 15వ రోజు వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరు రూ. 1 లక్షలతో కలిపి మొత్తంగా రెండు స్టేట్స్ లో 0.27 కోట్లు షేర్ వసూళ్లను అందుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన మొత్తం కలెక్షన్స్
'సర్కారు వారి పాట' సినిమాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 15 రోజులకు గాను వచ్చిన టోటల్ ఏరియాల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.. నైజాంలో రూ. 32.87 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.34 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.26 కోట్లు, ఈస్ట్‌లో రూ. 8.37 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.53 కోట్లు, గుంటూరులో రూ. 8.42 కోట్లు, కృష్ణాలో రూ. 5.75 కోట్లు, నెల్లూరులో రూ. 3.42 కోట్లు రాగా టోటల్ గా రూ. 87.96 కోట్లు షేర్, రూ. 132.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 15 రోజుల్లో రూ. 87.96 కోట్లు షేర్ రాబట్టిన 'సర్కారు వారి పాట'.. మిగిలిన ప్రాంతాల్లో మంచి వసూళ్లను సాధించింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.70 కోట్లు, ఓవర్సీస్లో రూ. 12.35 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా వరల్డ్ వైడ్ చూసుకుంటే 11 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 107.01 కోట్లు షేర్, రూ. 172.00 కోట్ల గ్రాస్ వచ్చింది.


రావాల్సింది ఇంకా ఉంది!
సర్కారు వారి పాట సినిమా రెండు వారాల అనంతరం కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. రెండవ వారంలోనే సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్లు రాబట్టి ఉంటే పెద్దగా నష్టాలు వచ్చి ఉండేవి కావు. ఇక ఈ సినిమా బిజినెస్ ను బట్టి చూస్తే కొంత నష్టాల బారిన పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల అయింది. ప్రపంచవ్యాప్తంగా 15 రోజుల్లో 107.01 కోట్ల షేర్ వచ్చింది. ఇక నష్టాల బారిన పడకుండా ఉండాలి అంటే ఇంకా 13.99 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.