twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SVP 16 Days Collections: మహేశ్‌కు దెబ్బ మీద దెబ్బ.. శుక్రవారం మరీ దారుణం.. అన్ని కోట్లు వస్తేనే!

    |

    సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. అంతలా ఈ హ్యాండ్సమ్ హీరో దాదాపు ఇరవై సంవత్సరాలుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో అయితే మరింత ఫామ్‌తో కనిపిస్తున్నాడు. దీనికి కారణం అతడు వరుసగా విజయాలను సొంతం చేసుకోవడమే.

    ఈ ఉత్సాహంతోనే అతడు ఇటీవలే 'సర్కారు వారి పాట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఓపెనింగ్స్‌తోనే ఇది ఎన్నో రికార్డులను నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా 16 రోజుల్లో ఎంత రాబట్టింది? ఇంకెంత వస్తే హిట్ అవుతుంది? అనేవి చూద్దాం పదండి!

    సర్కారు వారి పాట నేపథ్యం ఇదే

    సర్కారు వారి పాట నేపథ్యం ఇదే

    సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే 'సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో సముద్రఖని ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు.

    బ్రా కూడా లేకుండా హీరోయిన్ ఫోజులు: ఎద అందాలు పూర్తిగా కనిపించేలా!బ్రా కూడా లేకుండా హీరోయిన్ ఫోజులు: ఎద అందాలు పూర్తిగా కనిపించేలా!

    సర్కారు వారి పాట బిజినెస్ ఇలా

    సర్కారు వారి పాట బిజినెస్ ఇలా


    మహేశ్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు అన్ని ప్రాంతాల్లోనూ పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఈ సినిమాకు రూ. 120 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

    16వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    16వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?


    క్రేజీ కాంబినేషన్‌లో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'సర్కారు వారి పాట' చిత్రానికి ఆరంభంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. దీంతో ఈ సినిమా ఎన్నో రికార్డులు తిరగరాసింది. అయితే, క్రమంగా దీనికి వసూళ్లు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 16వ రోజు కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి. ఫలితంగా దీనికి రూ. 13 లక్షలే వచ్చాయి.

    <strong>హాట్ షోతో షాకిచ్చిన యాంకర్ స్రవంతి: ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే!</strong><br />హాట్ షోతో షాకిచ్చిన యాంకర్ స్రవంతి: ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే!

    16 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    16 రోజులకు కలిపి ఎంతొచ్చింది?


    16 రోజులకు కలిపి ఏపీ, తెలంగాణలో 'సర్కారు వారి పాట' బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 32.92 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.36 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.28 కోట్లు, ఈస్ట్‌లో రూ. 8.37 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.55 కోట్లు, గుంటూరులో రూ. 8.42 కోట్లు, కృష్ణాలో రూ. 5.76 కోట్లు, నెల్లూరులో రూ. 3.43 కోట్లతో కలిపి రూ. 88.09 కోట్లు షేర్, రూ. 132.80 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?


    తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల్లో రూ. 88.09 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన 'సర్కారు వారి పాట'.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగా రాణించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.72 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.38 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 16 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 107.19 కోట్లు షేర్‌తో పాటు రూ. 172.40 కోట్ల గ్రాస్ వచ్చింది.

    <strong>బీచ్‌లో రెచ్చిపోయిన అమలా పాల్: ఏం చూపించకూడదో అదే చూపిస్తూ!</strong><br />బీచ్‌లో రెచ్చిపోయిన అమలా పాల్: ఏం చూపించకూడదో అదే చూపిస్తూ!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


    మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 121 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 16 రోజుల్లో రూ. 107.19 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 13.80 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌‌ సొంతం చేసుకుంటుంది.

    English summary
    Mahesh Babu Did Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. This Movie Collects Rs 107.19 Cr in 16 Days
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X