SVP 17 Days Collections: శనివారం షాకింగ్ కలెక్షన్లు.. పెరిగినా తప్పని నిరాశ.. ఇంకెంత రావాలంటే!
ఈ మధ్య కాలంలో వరుస పెట్టి విజయాల మీద విజయాలను అందుకుంటూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ జోష్‌తోనే ఇటీవలే అతడు 'సర్కారు వారి పాట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి.
దీంతో ఓపెనింగ్స్ భారీగా దక్కాయి. అయితే, క్రమంగా 'సర్కారు వారి పాట'కు వసూళ్లు పడిపోతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 17వ రోజైన శనివారం కాసింత పెరిగాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా ఇప్పటి వరకూ ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంటుంది? అనే విషయాలను చూద్దాం పదండి!

సర్కారు వారి పాటలో స్టార్ హీరో
ఫుల్ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే 'సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో సముద్రఖని ప్రతినాయకుడిగా నటించారు.

సర్కారు వారి పాట బిజినెస్ ఇలా
క్రేజీ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు అన్ని ప్రాంతాల్లోనూ పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఈ సినిమాకు రూ. 120 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్.

17వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురాం పెట్ల రూపొందించిన 'సర్కారు వారి పాట' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు ఆరంభంలో భారీ స్థాయిలో వచ్చాయి. కానీ, కొద్ది రోజులుగా ఇవి క్రమంగా తగ్గుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీకెండ్ అయిన శనివారం దీనికి ఆదరణ పెరిగింది. ఫలితంగా 17వ రోజు ఈ సినిమాకు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 22 లక్షలు వచ్చాయి.

17 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
ఏపీ, తెలంగాణలో 17 రోజులకు కలిపి 'సర్కారు వారి పాట' బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 32.98 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.40 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.34 కోట్లు, ఈస్ట్‌లో రూ. 8.39 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.56 కోట్లు, గుంటూరులో రూ. 8.43 కోట్లు, కృష్ణాలో రూ. 5.77 కోట్లు, నెల్లూరులో రూ. 3.44 కోట్లతో కలిపి రూ. 88.31 కోట్లు షేర్, రూ. 133.20 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో రూ. 88.31 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన 'సర్కారు వారి పాట'.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగా రాణించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.76 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.43 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 17 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 107.50 కోట్లు షేర్‌తో పాటు రూ. 173 కోట్ల గ్రాస్ వచ్చింది.
Recommended Video


బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
మహేశ్ - పరశురాం కాంబోలో వచ్చిన 'సర్కారు వారి పాట' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 121 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 17 రోజుల్లో రూ. 107.50 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 13.80 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్ అందుకుంటుంది.


Click it and Unblock the Notifications











