SVP 18 Days Collections: మహేశ్‌కు కలిసొచ్చిన సండే.. 18వ రోజు భారీగా.. అన్ని కోట్లు వస్తేనే హిట్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న బడా హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. కెరీర్ ఆరంభం నుంచే కమర్షియల్ హీరోగా పేరొందిన అతడు.. సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూనే వెళ్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుసగా హిట్ల మీద హిట్లను కొడుతూ సూపర్ డూపర్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు.

ఈ జోష్‌తోనే ఇప్పుడు 'సర్కారు వారి పాట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు దక్కాయి. అయితే, క్రమంగా వసూళ్లు పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో 18వ రోజైన ఆదివారం కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇప్పటి వరకూ ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

సర్కారు వారి పాటతో మహేశ్ బాబు

సర్కారు వారి పాటతో మహేశ్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే ‘సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో సముద్రఖని విలన్ పాత్రను చేశారు.

సర్కారు వారి పాట బిజినెస్ ఇలా

సర్కారు వారి పాట బిజినెస్ ఇలా


సోషల్ మెసేజ్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు అన్ని ప్రాంతాల్లోనూ పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఈ సినిమాకు రూ. 120 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

18వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

18వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?


‘సర్కారు వారి పాట'కు 18వ రోజు ఆంధ్రా, తెలంగాణలో కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 30 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్‌లో రూ. 9 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి ఆదివారం రూ. 79 లక్షలు షేర్, రూ. 1.30 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

18 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

18 రోజులకు కలిపి ఎంతొచ్చింది?


ఏపీ, తెలంగాణలో 18 రోజులకు కలిపి ‘సర్కారు వారి పాట' బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 33.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.53 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.48 కోట్లు, ఈస్ట్‌లో రూ. 8.48 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.60 కోట్లు, గుంటూరులో రూ. 8.45 కోట్లు, కృష్ణాలో రూ. 5.81 కోట్లు, నెల్లూరులో రూ. 3.47 కోట్లతో కలిపి రూ. 89.10 కోట్లు షేర్, రూ. 134.50 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?


తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో రూ. 89.10 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన ‘సర్కారు వారి పాట'.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగా రాణించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.55 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 18 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 108.50 కోట్లు షేర్‌తో పాటు రూ. 174.75 కోట్ల గ్రాస్ వచ్చింది.

Recommended Video

Top 10 Pan India Stars... నంబర్‌వన్ స్థానం కోసం లొల్లి #Tollywood | Telugu Filmibeat
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 121 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 18 రోజుల్లో రూ. 108.50 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 12.50 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌‌ సొంతం చేసుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X