SVP 19 Days Collections: వీక్ డే ఎఫెక్ట్.. దారుణంగా వసూళ్లు.. హిట్ కొట్టాలంటే అన్ని కోట్లు కావలసిందే!

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా హిట్ల మీద హిట్లను కొడుతూ మంచి ఫామ్‌లో ఉన్నారు. తాజాగా ఆయన 'సర్కారు వారి పాట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లు కూడా దక్కాయి. అయితే ఇప్పటికే విడుదలై మూడు వారాలు పూర్తయిన క్రమంలో వసూళ్లు నెమ్మదిగా పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో 18వ రోజైన ఆదివారం కలెక్షన్లు భారీగా పెరిగగా సోమవారం అనే దాని మీద ఒక లుక్కు వేద్దాం. మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట' సినిమాను పరశురాం పెట్ల తెరకెక్కించగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేష్ స్వయంగా తన జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సినిమాను నిర్మించారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సినిమా థియేట్రికల్ హక్కులకు అన్ని ప్రాంతాల్లోనూ పోటీ ఏర్పడింది. ఈ సినిమాకు రూ. 120 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. 'సర్కారు వారి పాట'కు 19వ రోజయిన సోమవారం నాడు ఆదివారంతో పోలిస్తే భారీ డ్రాప్ కనిపించింది. ఏరియా వారీగా చూస్తే ఆంధ్రా, తెలంగాణలో కలెక్షన్లు భారీగా తగ్గాయి. 19వ రోజున నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్ష, గుంటూరులో లక్ష లోపు , కృష్ణాలో రూ. 1 లక్ష, నెల్లూరులో రూ. 1 లక్షతో కలిపి సోమవారం రూ.20 లక్షల షేర్ రాబట్టింది. ఏపీ, తెలంగాణలో 19 రోజులకు 89.30 కోట్లు షేర్, రూ. 134.90 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

Mahesh Babu starrer Sarkaru Vaari Paata Movie Collected Rs 108.78 Crores in 19 Days.

తెలుగు రాష్ట్రాల్లో 19 రోజుల్లో రూ. 89.30 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన 'సర్కారు వారి పాట'.. మిగిలిన ప్రాంతాల్లో కూడా బానే రాణించింది. ఫలితంగా కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.88 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.60 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 19 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 108.78 కోట్లు షేర్‌తో పాటు రూ. 175.27 కోట్ల గ్రాస్ వచ్చింది. 'సర్కారు వారి పాట' సినిమాకు ముందు నుంచి ఏర్పడిన అంచనాలకు అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేయడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 121 కోట్లుగా ఫిక్స్ చేశారు. ఇక, ఈ సినిమా 18 రోజుల్లో రూ. 108.78 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 12.22 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌‌ సొంతం చేసుకుంటుంది. ఇక ఈ పరిస్థితుల్లో అయితే అది కష్టం అనే చెప్పాలి. చూడాలి మరి ఏమవుతుందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X