Sarkaru Vaari Paata : రెండో రోజూ సత్తా చాటిన సర్కారు వారి పాట.. ఎన్ని కోట్లు కొల్లగొట్టింది అంటే?

వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్స్ అందించిన డైరెక్టర్ పరశురాం మహేష్ బాబు కాంబో నేపధ్యంగా భారీ బిజినెస్‌ను జరుపుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో మొదటి రోజే మహేష్ బాబు సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టగా రెండో రోజు కూడా కలెక్షన్స్ జోరు చూపించింది. మరి రెండో రోజు ఈ సినిమా ఎక్కడ ఎన్ని కలెక్షన్స్ సాధించిందో చూద్దామా..

సర్కారు వారి పాట

సర్కారు వారి పాట

మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతాన్ని అందించగా సముద్రఖని విలన్‌గా నటించారు. ఇక నదియా, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

బిజినెస్ చూస్తే

బిజినెస్ చూస్తే

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు రూ. 120 కోట్లు మేర బిజినెస్ జరిగింది. ఏరియాల వారిగా చూస్తె నైజాంలో 36 కోట్లు, సీడెడ్‌లో 13 కోట్లు, ఉత్తరాంధ్రలో 12.50 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 8.50 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 7 కోట్లు, గుంటూరు జిల్లాలో 9 కోట్లు, కృష్ణా జిల్లాలో 7.5 కోట్లు, నెల్లూరు జిల్లాలో 4 కోట్ల బిజినెస్ చేసింది. ఏపీ, తెలంగాణలో మొత్తంగా 97 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

బయట కూడా

బయట కూడా

తెలుగు రాష్ట్రాలు కాకుండా బయట అంటే కర్ణాటకలో 8.5 కోట్లు, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో 3 కోట్లు, ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు 11 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కుల బిజినెస్ 120 కోట్ల మేర జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 121 కోట్లకుపైగా షేర్ సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మొదటి రోజు కలెక్షన్స్ లో రచ్చ చేసిన ఈ సినిమా రెండో రోజు కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది.

రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో

రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో


సర్కారు వారి పాట సినిమా కలెక్షన్స్ రెండో రోజు ఇలా ఉన్నాయి. నైజాంలో 4.86 కోట్లు, సీడెడ్‌లో 1.26 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.65 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 1.08 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 45 లక్షలు, గుంటూరు జిల్లాలో 51 లక్షలు, కృష్ణా జిల్లాలో 88 లక్షలు, నెల్లూరు జిల్లాలో 35 లక్షలు వసూలు చేసింది. దీంతో తొలి రోజున 11.04 కోట్ల షేర్, 16.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

రెండు రోజులకు కలిపి

రెండు రోజులకు కలిపి

సర్కారు వారి పాట సినిమా రెండు రోజుల్లో కలిపి ఎన్ని కలెక్షన్స్ రాబట్టిందో ఇప్పుడు చూద్దాం. నైజాంలో 17.10 కోట్లు, సీడెడ్‌లో 5.96 కోట్లు, ఉత్తరాంధ్రలో 5.39 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 4.33 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 3.19 లక్షలు, గుంటూరు జిల్లాలో 6.34 లక్షలు, కృష్ణా జిల్లాలో 2.83 లక్షలు, నెల్లూరు జిల్లాలో 1.91 లక్షలు వసూలు చేసింది. దీంతో రెండు రోజులకు 47.05 కోట్ల షేర్, 66.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి ఇది

ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి ఇది

ఇక అలాగే సర్కారు వారి పాట మిగతా ప్రాంతాల్లో భారీ వసూళ్లను నమోదు చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రెండు రోజులకు మొత్తంగా 2.70 కోట్లు రాబట్టింది. అలాగే ఓవర్సీస్‌లో ఈ సినిమా సుమారు 7.75 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అయితే అమెరికా ఒకటిన్నర మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం 58.15 కోట్ల షేర్, 90 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. సర్కారు వారీ పాట సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 121 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించాలి. తొలి రోజు తర్వాత ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే తక్కువలో తక్కువ ఇంకా 62.85 కోట్లకు పైగా వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్‌లో కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాల్సిందే.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X