twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SVP 2 Weeks Collections: మహేశ్ మూవీకి బిగ్ షాక్.. తొలిసారి ఇంత తక్కువ.. ఇంకెంత వస్తే హిట్ అంటే!

    |

    బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సుదీర్ఘ కాలంగా స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సినిమా సినిమాకూ తన మార్కెట్‌ను విపరీతంగా పెంచుకుంటోన్న అతడు.. ఈ మధ్య కాలంలో వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే 'సర్కారు వారి పాట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా రెండు వారాల్లో ఎంత రాబట్టింది? ఇంకెంత వస్తే హిట్ అవుతుంది? అనేవి చూద్దాం పదండి!

    సర్కారు వారి పాటతో మహేశ్ బాబు

    సర్కారు వారి పాటతో మహేశ్ బాబు

    టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే 'సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో సముద్రఖని ప్రతినాయకుడి పాత్రను పోషించారు.

    బీచ్‌లో రెచ్చిపోయిన అమలా పాల్: ఏం చూపించకూడదో అదే చూపిస్తూ!బీచ్‌లో రెచ్చిపోయిన అమలా పాల్: ఏం చూపించకూడదో అదే చూపిస్తూ!

    సర్కారు వారి పాట బిజినెస్ ఇలా

    సర్కారు వారి పాట బిజినెస్ ఇలా

    భారీ బడ్జెట్‌‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు అన్ని ప్రాంతాల్లోనూ పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఈ సినిమాకు రూ. 120 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

    14వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    14వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    'సర్కారు వారి పాట'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 14వ రోజు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. దీంతో నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 27 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

    స్పోర్ట్స్ బ్రాతో రష్మిక హాట్ సెల్ఫీ: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటు ఫోజుస్పోర్ట్స్ బ్రాతో రష్మిక హాట్ సెల్ఫీ: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటు ఫోజు

    2 వారాలకు కలిపి ఎంత వచ్చింది?

    2 వారాలకు కలిపి ఎంత వచ్చింది?

    2 వారాలకు కలిపి ఏపీ, తెలంగాణలో 'సర్కారు వారి పాట' బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 32.77 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.31 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.21 కోట్లు, ఈస్ట్‌లో రూ. 8.35 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.51 కోట్లు, గుంటూరులో రూ. 8.41 కోట్లు, కృష్ణాలో రూ. 5.73 కోట్లు, నెల్లూరులో రూ. 3.41 కోట్లతో కలిపి రూ. 87.70 కోట్లు షేర్, రూ. 132 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో రూ. 87.70 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన 'సర్కారు వారి పాట'.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగా రాణించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.30 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 14 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.65 కోట్లు షేర్‌తో పాటు రూ. 171.30 కోట్ల గ్రాస్ వచ్చింది.

    హీరోయిన్ బెడ్‌రూం వీడియో వైరల్: బట్టలు విప్పేసి మరీ అలా కనిపించడంతో!హీరోయిన్ బెడ్‌రూం వీడియో వైరల్: బట్టలు విప్పేసి మరీ అలా కనిపించడంతో!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    క్రేజీ కాంబోలో వచ్చిన 'సర్కారు వారి పాట' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 121 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 2 వారాల్లో రూ. 106.65 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 14.35 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌‌ సొంతం చేసుకుంటుంది.

    English summary
    Mahesh Babu Did Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. This Movie Collects Rs 106.65 Cr in 2 Weeks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X