SVP 20 Days Collections: మరోసారి భారీ ఎదురుదెబ్బ.. 121 కోట్లకు వచ్చిందింతే.. హిట్ అవ్వాలంటే మాత్రం!
ఆ మధ్య కొన్ని భారీ పరాజయాలతో ఇబ్బందులు పడినా.. కొంత కాలంగా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'సర్కారు వారి పాట' అనే సినిమాతో ఈ స్టార్ హీరో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం భారీగానే దక్కాయి. అయితే, క్రమంగా వసూళ్లు పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో 20వ రోజైన మంగళవారం కలెక్షన్లు మరింతగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇప్పటి వరకూ ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

సర్కారు వారి పాట పాడిన మహేశ్
ఫుల్ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే 'సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో సముద్రఖని నెగెటివ్ రోల్‌లో కనిపించారు.

సర్కారు వారి పాట బిజినెస్ ఇలా
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు అన్ని ప్రాంతాల్లోనూ పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఈ సినిమాకు రూ. 120 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

20వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
'సర్కారు వారి పాట' చిత్రానికి ఆరంభంలో ఆంధ్రా, తెలంగాణలో కలిపి కలెక్షన్లు భారీగా వచ్చాయి. అయితే, ఆ తర్వాత ఈ సినిమా రెస్పాన్స్‌ను అంతగా రాబట్టుకోలేకపోయింది. ఫలితంగా కలెక్షన్లు అంతకంతకూ పడిపోతూనే వచ్చాయి. ఈ క్రమంలోనే గత వీకెండ్‌లో పెరిగినా.. వీక్ డేస్‌లో తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో 20వ రోజు దీనికి రెండు రాష్ట్రాల్లో రూ. 15 లక్షలు వచ్చాయి.

20 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
20 రోజులకు కలిపి 'సర్కారు వారి పాట' ఏపీ, తెలంగాణలో బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 33.42 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.59 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.52 కోట్లు, ఈస్ట్‌లో రూ. 8.52 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.62 కోట్లు, గుంటూరులో రూ. 8.46 కోట్లు, కృష్ణాలో రూ. 5.83 కోట్లు, నెల్లూరులో రూ. 3.48 కోట్లతో కలిపి రూ. 89.45 కోట్లు షేర్, రూ. 135.20 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో 20 రోజుల్లో రూ. 89.45 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన 'సర్కారు వారి పాట'.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగా రాణించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.62 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 20 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 108.97 కోట్లు షేర్‌తో పాటు రూ. 175.55 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
మహేశ్ బాబు హీరోగా వచ్చిన 'సర్కారు వారి పాట' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 121 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 20 రోజుల్లో రూ. 108.97కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 12.03 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్ సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











