twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SVP 22 Days Collections: మహేశ్ మూవీకి భారీ దెబ్బ.. 22వ రోజు ఇంతే.. హిట్ అవ్వాలంటే!

    |

    సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా అతడు దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతోన్నాడు. అంతేకాదు, ఫలితాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో నాలుగు సూపర్ హిట్లను అందుకున్న అతడు.. కెరీర్‌లో తొలిసారి భీకరమైన ఫామ్‌తో కనిపిస్తున్నాడు.

    ఈ జోష్‌తోనే మహేశ్ ఇటీవలే 'సర్కారు వారి పాట' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీకి ఆరంభంలో వచ్చిన కలెక్షన్లు ఇప్పుడు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా 22 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

    సర్కారు వారి పాటలో సూపర్ స్టార్

    సర్కారు వారి పాటలో సూపర్ స్టార్

    టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే 'సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సముద్రఖని ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు.

    స్నానం చేస్తోన్న ఫొటోలతో షాకిచ్చిన హీరోయిన్: గర్భంతో ఉన్నా అస్సలు తగ్గట్లేదుగా!స్నానం చేస్తోన్న ఫొటోలతో షాకిచ్చిన హీరోయిన్: గర్భంతో ఉన్నా అస్సలు తగ్గట్లేదుగా!

    సర్కారు వారి పాట బిజినెస్ ఇలా

    సర్కారు వారి పాట బిజినెస్ ఇలా

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు అన్ని ప్రాంతాల్లోనూ పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఈ సినిమాకు రూ. 120 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

    22వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    22వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    ఆంధ్రా, తెలంగాణలో కలిపి 'సర్కారు వారి పాట' చిత్రానికి కలెక్షన్లు ఆరంభంలో భారీగా వచ్చాయి. అయితే, ఆ తర్వాత ఈ సినిమా డౌన్ అవుతూనే వస్తోంది. ఫలితంగా కలెక్షన్లు క్రమంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలోనే గత వీకెండ్‌లో పెరిగినా.. మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో 22వ రోజైన గురువారం ఈ మూవీకి రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 10 లక్షలే వచ్చాయి.

    మరోసారి రెచ్చిపోయిన హీరోయిన్ శ్రీయ: బ్రాతో హాట్ సెల్ఫీ.. ఆమెనిలా చూశారంటే!మరోసారి రెచ్చిపోయిన హీరోయిన్ శ్రీయ: బ్రాతో హాట్ సెల్ఫీ.. ఆమెనిలా చూశారంటే!

    22 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?

    22 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?

    'సర్కారు వారి పాట' ఏపీ, తెలంగాణలో 22 రోజుల్లో బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 33.51 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.62 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.52 కోట్లు, ఈస్ట్‌లో రూ. 8.52 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.63 కోట్లు, గుంటూరులో రూ. 8.48 కోట్లు, కృష్ణాలో రూ. 5.84 కోట్లు, నెల్లూరులో రూ. 3.51 కోట్లతో కలిపి రూ. 89.70 కోట్లు షేర్, రూ. 135.35 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    తెలుగు రాష్ట్రాల్లో 22 రోజుల్లో రూ. 89.70 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన 'సర్కారు వారి పాట'.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగా రాణించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.93 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.67 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 22 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 109.30 కోట్లు షేర్‌తో పాటు రూ. 178.30 కోట్ల గ్రాస్ వచ్చింది.

    Major Twitter Review: అంతటా అలాంటి టాక్.. రేటింగ్ ఇవ్వనంతగా.. ఫైనల్ రిపోర్టు ఏంటంటే!Major Twitter Review: అంతటా అలాంటి టాక్.. రేటింగ్ ఇవ్వనంతగా.. ఫైనల్ రిపోర్టు ఏంటంటే!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 121 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 22 రోజుల్లో రూ. 109.30 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 11.70 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌‌ సొంతం చేసుకుంటుంది.

    English summary
    Mahesh Babu Did Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. This Movie Collects Rs 109.17 Cr in 22 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X