SVP 3 Days Collections: శనివారం మహేశ్ దండయాత్ర.. 3వ రోజే అన్ని కోట్లు.. పవన్ రికార్డు మాత్రం సేఫ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్నింటికి మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా అలరిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభం నుంచే ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న అతడు.. ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఫలితంగా మార్కెట్‌ను కూడా భారీగా పెంచుకున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో హ్యాట్రిక్ హిట్లను అందుకున్న మహేశ్.. ఈ జోష్‌తోనే 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే హిట్ అవుతుంది? అనేవి చూద్దాం పదండి!

సర్కారు వారి పాటతో వచ్చిన మహేశ్

సర్కారు వారి పాటతో వచ్చిన మహేశ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సముద్రఖని విలన్‌ పాత్ర చేశారు.

సర్కారు వారి పాట బిజినెస్ డీటేల్స్

సర్కారు వారి పాట బిజినెస్ డీటేల్స్


క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు అన్ని ప్రాంతాల్లోనూ పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఈ సినిమాకు రూ. 120 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

3వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

3వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?


'సర్కారు వారి పాట'కు 3వ రోజూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో నైజాంలో రూ. 5.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.42 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.95 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.06 కోట్లు, వెస్ట్‌లో రూ. 45 లక్షలు, గుంటూరులో రూ. 46 లక్షలు, కృష్ణాలో రూ. 92 లక్షలు, నెల్లూరులో రూ. 39 లక్షలతో కలిపి రూ. 12.01 కోట్లు షేర్, రూ. 18.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

3 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

3 రోజులకు కలిపి ఎంత వచ్చింది?


తెలుగు రాష్ట్రాల్లో 'సర్కారు వారి పాట' మూడు రోజుల్లోనూ బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 22.48 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.38 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.34 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.39 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.64 కోట్లు, గుంటూరులో రూ. 6.80 కోట్లు, కృష్ణాలో రూ. 3.75 కోట్లు, నెల్లూరులో రూ. 2.30 కోట్లతో కలిపి రూ. 59.06 కోట్లు షేర్, రూ. 84.40 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?


ఏపీ, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 59.06 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన 'సర్కారు వారి పాట'.. మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తాను చాటుకుంది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9.21 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 3 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 72.22 కోట్లు షేర్‌తో పాటు రూ. 112 కోట్ల గ్రాస్ వచ్చింది.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


భారీ అంచనాల నడుమ విడుదలైన 'సర్కారు వారి పాట' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 121 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 3 రోజుల్లో రూ. 72.22 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 48.78 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ చేరుతుంది.

పవన్ కల్యాణ్ రికార్డు మాత్రం సేఫ్

పవన్ కల్యాణ్ రికార్డు మాత్రం సేఫ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' మూవీ మూడు రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో కలుపుకుని రూ. 59.06 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో 5వ స్థానానికి చేరుకుంది. ఇందులో మొదటి స్థానంలో RRR (33.53కోట్లు) ఉంది. ఈరోజు పవన్ భీమ్లా నాయక్ రూ. 13.51 కోట్లు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X