Don't Miss!
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
SVP 3 Weeks Collections: 121 కోట్ల టార్గెట్.. 3 వారాల్లో షాకింగ్‌గా.. ఇంకెంత వస్తే హిట్ అంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌తో పాటు హ్యాడ్సమ్ లుక్స్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే 'సర్కారు వారి పాట' అనే సినిమాతో మహేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం భారీగానే దక్కాయి. అయితే, క్రమంగా వసూళ్లు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 3 వారాల కలెక్షన్లను చూద్దాం పదండి!
సర్కారు వారి పాట అంటూ మహేశ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే 'సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సముద్రఖని ప్రతినాయకుడి పాత్రను పోషించాడు.
డ్రెస్ విప్పేసి షాకిచ్చిన అమలా పాల్: ఎద అందాలు కనిపించేలా ఘోరంగా!
సర్కారు వారి పాట బిజినెస్ ఇలా
మహేశ్ కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు అన్ని ప్రాంతాల్లోనూ పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఈ సినిమాకు రూ. 120 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్.
21వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
'సర్కారు
వారి
పాట'
చిత్రానికి
ఆంధ్రా,
తెలంగాణలో
కలిపి
కలెక్షన్లు
భారీగా
వచ్చాయి.
అయితే,
ఆ
తర్వాత
ఈ
సినిమా
స్పందనను
అంతగా
రాబట్టలేకపోయింది.
ఫలితంగా
కలెక్షన్లు
క్రమంగా
పడిపోతూ
వచ్చాయి.
ఈ
క్రమంలోనే
గత
వీకెండ్లో
పెరిగినా..
మళ్లీ
తగ్గుముఖం
పడుతూ
వస్తున్నాయి.
ఈ
నేపథ్యంలో
21వ
రోజు
దీనికి
రెండు
రాష్ట్రాల్లో
కలిపి
రూ.
14
లక్షలు
వచ్చాయి.
మరోసారి రష్మిక మందన్నా హాట్ ట్రీట్: ఎద భాగం కనిపించేలా ఘాటుగా!
3 వారాలకూ కలిపి ఎంతొచ్చింది?
'సర్కారు వారి పాట' ఏపీ, తెలంగాణలో మూడు వారాల్లో బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 33.47 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.60 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.57 కోట్లు, ఈస్ట్‌లో రూ. 8.52 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.63 కోట్లు, గుంటూరులో రూ. 8.47 కోట్లు, కృష్ణాలో రూ. 5.84 కోట్లు, నెల్లూరులో రూ. 3.50 కోట్లతో కలిపి రూ. 89.60 కోట్లు షేర్, రూ. 135.20 కోట్లు గ్రాస్ రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో 3 వారాల్లో రూ. 89.60 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన 'సర్కారు వారి పాట'.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగా రాణించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.92 కోట్లు, ఓవర్సీస్లో రూ. 12.65 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 3 వారాల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 109.17 కోట్లు షేర్‌తో పాటు రూ. 178 కోట్ల గ్రాస్ వచ్చింది.
Poorna Gets Engaged: కోటీశ్వరుడితో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ పూర్ణ.. అతడి బ్యాగ్రౌండ్ తెలిస్తే!
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
క్రేజీ కాంబినేషన్లో వచ్చిన 'సర్కారు వారి పాట' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 121 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 3 వారాల్లో రూ. 109.17 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 11.83 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్ సొంతం చేసుకుంటుంది.