SVP 6 Days Collections: 50 శాతం కలెక్షన్లు డౌన్.. 121 కోట్ల బిజినెస్.. హిట్ అవ్వాలంటే అదే జరగాలి!
సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభం నుంచే హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన అతడు.. ఈ మధ్య కాలంలో 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ సక్సెస్‌లను అందుకుని ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'సర్కారు వారి పాట' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ ఆదరణను అందుకుంటోంది. ఫలితంగా కలెక్షన్లను రాబడుతోంది.. ఈ నేపథ్యంలో 'సర్కారు వారి పాట' మూవీ 6 రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

సర్కారు వారి పాటతో సూపర్ స్టార్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే 'సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సముద్రఖని విలన్‌గా నటించారు.

సర్కారు వారి పాట బిజినెస్ ఇలా
మహేశ్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు అన్ని ప్రాంతాల్లోనూ పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఈ సినిమాకు రూ. 120 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

6వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
'సర్కారు వారి పాట'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 6వ రోజు రెస్పాన్స్ మరింతగా తగ్గిపోయింది. దీంతో నైజాంలో రూ. 76 లక్షలు, సీడెడ్‌లో రూ. 30 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 34 లక్షలు, ఈస్ట్‌లో రూ. 30 లక్షలు, వెస్ట్‌లో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 13 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో కలిపి రూ. 2.32 కోట్లు షేర్, రూ. 4 కోట్లు గ్రాస్ వచ్చింది.

6 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
6 రోజులకు కలిపి ఏపీ, తెలంగాణలో 'సర్కారు వారి పాట' బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 29.43 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.64 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10.40 కోట్లు, ఈస్ట్‌లో రూ. 7.17 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.59 కోట్లు, గుంటూరులో రూ. 7.89 కోట్లు, కృష్ణాలో రూ. 4.97 కోట్లు, నెల్లూరులో రూ. 2.99 కోట్లతో కలిపి రూ. 77.08 కోట్లు షేర్, రూ. 112.60 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో రూ. 77.08 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన 'సర్కారు వారి పాట'.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగా రాణించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.34 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 6 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 94.02 కోట్లు షేర్‌తో పాటు రూ. 148 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
సూపర్ స్టార్ మహేశ్ నటించిన 'సర్కారు వారి పాట' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 121 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 6 రోజుల్లో రూ. 94.02 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 26.98 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్ సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











