Sarkaru Vaari paata day 7 Collections.. భారీగా తగ్గిన మహేష్ మూవీ కలెక్షన్లు.. లాభాల్లోకి రావాలంటే?
సర్కారు వారి పాట వసూళ్ల వివాదం ఎలా ఉన్న అధికారిక లెక్కల ప్రకారం ఈ సినిమా భారీగా వసూళ్లను నమోదు చేస్తున్నది. లాంగ్ వీకెండ్‌తోపాటు హాలీడేలు కలిసి రావడంతో మంచి కలెక్షన్లను నమోదు చేసింది. తొలి వారాంతంలో 100 కోట్లు నమోదు చేసిన ఈ చిత్రం ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోయిందనే తాజా వసూళ్లు చెబుతున్నాయి. సర్కారు వారీ పాట 7వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

84 శాతం కలెక్షన్లు
సర్కారు వారీ పాట థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. 120 కోట్ల మేర బిజినెస్ చేసింది. తొలివారం సానుకూలమైన ఫలితాలను రాబట్టడంతో ఈ చిత్రం అధికారిక లెక్కల ప్రకారం 84 శాతం కలెక్షన్లను రాబట్టింది. రెండో వారంలో బ్రేక్ ఈవెన్ సాధించేందుకు ఈ సినిమా బాక్సాఫీస్ రన్‌ను కొనసాగిస్తున్నది.

ఆస్ట్రేలియాలో 8వ స్థానం
ఇక ప్రపంచ ప్రఖ్యాత రేటింగ్ సంస్థ కామ్ స్కోర్ వెల్లడించిన ప్రకారం.. సర్కారు వారి పాట చిత్రం ఆస్ట్రేలియాలో దుమ్మురేపుతున్నది. ఈ సినిమా మే 12 నుంచి 18వ తేదీ వరకు భారీగా వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం వారం రోజుల్లో 386,231 ఆస్ట్రేలియన్ డాలర్లను సాధించింది. ఈ చిత్రం ఆస్ట్రేలియన్ బాక్సాఫీస్ వద్ద 8వ స్థానంలో నిలిచింది.

ఏపీ, నైజాం కలెక్షన్లు
ఇక ఏపీ, నైజాంలో సర్కారు వారి పాట 86 కోట్లకుపైగా థియేట్రికల్ బిజినెస్ చేసింది. అయితే ఈ చిత్రం తొలి రోజున 37 కోట్లు, రెండో రోజున 11.64 కోట్లు, మూడో రోజున 12.89 కోట్లు, నాలుగో రోజున 13.61 కోట్లు, ఐదో రోజున 5 కోట్లు, ఆరో రోజున 3.42 కోట్లు సాధించింది. ఇక ఏడో రోజున 2.55 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం తొలివారం 86 కోట్ల షేర్ సాధించింది.

ఏడో రోజున తెలుగు రాష్ట్రాల్లో
సర్కారు వారి పాట చిత్రం నైజాంలో మెరుగైన కలెక్షన్లను ఏడో రోజు నమోదు చేసింది. బుధవారం ఈ చిత్రం 1 కోటి రూపాయలకుపైగానే వసూళ్లను సాధించింది. గత ఏడు రోజుల్లో ఈ చిత్రంం నైజాంలో 33.88 కోట్ల షేర్ సాధించింది. ఇక ఉత్తరాంధ్రలో ఈ చిత్రం 35 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 26 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 16 లక్షలు, గుంటూరులో 10 లక్షలు, కృష్ణా జిల్లాలో16 లక్షలు, నెల్లూరు జిల్లాలో 8 లక్షలు సాధించింది. దాంతో ఏపీ, నైజాంలో 1.82 కోట్ల షేర్, 3.4 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

సర్కారు వారీ పాట లాభాల్లోకి రావాలంటే
ఏపీ, తెలంగాణలో గత ఏడు రోజుల్లో మొత్తంగా 82 కోట్లుకుపైగానే వసూళ్లను రాబట్టింది. కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం 7 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 11 కోట్లకుపైగానే రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాపత్ంగా ఈ చిత్రం 100.76 కోట్ల షేర్ సాధించింది. ఇక ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 20 కోట్లు వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


Click it and Unblock the Notifications











