twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SVP 8 Days Collections: మరింత తగ్గిన కలెక్షన్లు.. 8 రోజుల్లోనే షాకింగ్‌గా.. ఇంకెంత రావాలంటే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా స్టార్‌డమ్‌ను అనుభవిస్తూ.. క్రమక్రమంగా తన మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. దీనికి తోడు ఇటీవలి కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే 'సర్కారు వారి పాట' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణను అందుకుంటోంది. ఫలితంగా అదిరిపోయే కలెక్షన్లను రాబడుతోంది. అయితే, రెండు మూడు రోజుల నుంచి ఈ మూవీ కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'సర్కారు వారి పాట' మూవీ 8 రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

    Recommended Video

    Sarkaru Vaari Paata Succuess Celebrations | Mahesh Babu Fans Euphoria | Filmibeat Telugu
     సర్కారు వారి పాటలో సూపర్ స్టార్

    సర్కారు వారి పాటలో సూపర్ స్టార్

    సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే ‘సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సముద్రఖని ప్రతినాయకుడిగా నటించారు.

     సర్కారు వారి పాట బిజినెస్ ఇలా

    సర్కారు వారి పాట బిజినెస్ ఇలా

    క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు అన్ని ప్రాంతాల్లోనూ పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఈ సినిమాకు రూ. 120 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    8వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    8వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    ‘సర్కారు వారి పాట'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 8వ రోజు రెస్పాన్స్ మరింతగా తగ్గిపోయింది. దీంతో నైజాంలో రూ. 53 లక్షలు, సీడెడ్‌లో రూ. 26 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 31 లక్షలు, ఈస్ట్‌లో రూ. 21 లక్షలు, వెస్ట్‌లో రూ. 18 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో కలిపి రూ. 1.79 కోట్లు షేర్, రూ. 3.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

    8 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    8 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    8 రోజులకు కలిపి ఏపీ, తెలంగాణలో ‘సర్కారు వారి పాట' బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 30.43 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.21 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 11.02 కోట్లు, ఈస్ట్‌లో రూ. 7.61 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.93 కోట్లు, గుంటూరులో రూ. 8.10 కోట్లు, కృష్ణాలో రూ. 5.25 కోట్లు, నెల్లూరులో రూ. 3.14 కోట్లతో కలిపి రూ. 80.69 కోట్లు షేర్, రూ. 119.35 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో రూ. 80.69 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన ‘సర్కారు వారి పాట'.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగా రాణించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.79 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.52 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 8 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 98.00 కోట్లు షేర్‌తో పాటు రూ. 155.40 కోట్ల గ్రాస్ వచ్చింది.

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 121 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 8 రోజుల్లో రూ. 98.00 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 23 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌‌ సొంతం చేసుకుంటుంది.

    English summary
    Mahesh Babu Did Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. This Movie Collects Rs 98.00 Cr in 8 Days. మహేశ్ బాబు.. పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేశాడు. ఈ సినిమా 8 రోజుల్లోనే రూ. 98.00 కోట్లు వసూలు చేసింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X