Sarkaru Vaari paata day 9 Collections.. మహేష్ మూవీ ఇంకా నష్టాల్లోనే.. లాభాల్లోకి రావాలంటే?
టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రిలీజైన సర్కారు వారీ పాట చిత్రం ఓ మోస్తారు వసూళ్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేస్తున్నది. రెండో వారంలో ప్రవేశించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నది. ప్రీ రిలీజ్ బిజినెస్‌తో పోల్చుకొంటే ఈ సినిమా డిస్టిబ్యూటర్లను ఇంకా నష్టాల్లోనే కొనసాగిస్తున్నది. ఈ సినిమా లాభాలను పంచాలంటే రానున్న రోజుల్లో భారీగా వసూళ్లను సాధించాల్సిన అవకాశం కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో సర్కారు వారీ పాట చిత్రం 9వ రోజున ఏ మేరకు వసూళ్లను సాధించిందంటే?

21 కోట్ల టార్గెట్‌గా
సర్కారు వారీ పాట చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్లుగా నమోదైంది. ఈ సినిమా లాభాల జోన్‌లోకి ప్రవేశించాలంటే.. కనీసం 121 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే గత 8 రోజుల్లో ఈ చిత్రం 158.6 కోట్ల గ్రాస్, 99.65 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. అయితే ఇంకా 21 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాల్సి ఉంది.

8 రోజల్లో తెలుగు రాష్ట్రాల్లో
తెలుగు రాష్ట్రాల్లో గత ఎనిమిది రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజున 36 కోట్లకుపైగా, రెండో రోజున 11 కోట్లకుపైగా, మూడో రోజున 12 కోట్లు, నాలుగో రోజున 12 కోట్లు, ఐదో రోజున 3.64 కోట్లు, ఆరో రోజున 2.32 కోట్లు, ఏడో రోజున 1.82 కోట్లు, ఎనిమిదో రోజున 1.79 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 81 కోట్ల షేర్, 120 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 9వ రోజు వసూళ్లు
ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో 9వ రోజున కొనసాగించిన సర్కారు వారి పాట చిత్రం పెద్దగా వసూళ్లను నమోదు చేయలేకపోయింది. ఈ చిత్రం నైజాంలో 4 లక్షలు, సీడెడ్‌లో 21 లక్షలు, ఉత్తరాంధ్రలో 24 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 17 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 లక్షలు, గుంటూరు జిల్లాలో 7 లక్షలు, కృష్ణా జిల్లాలో 7 లక్షలు, నెల్లూరు జిల్లాలో 5 లక్షలు వసూలు చేసింది. దాంతో 9వ రోజున ఈ చిత్రం 1.40 కోట్ల వసూలు షేర్, 2.65 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి.

మొత్తం 9 రోజుల కలెక్షన్లు
సర్కారు వారీ పాట చిత్రం గత 9 రోజుల్లో వసూలు చేసిన వివరాల్లోకి వెళితే.. నైజాంలో 30.89 కోట్లు, సీడెడ్‌లో 10.42 కోట్లు, ఉత్తరాంధ్రలో 11.26 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 7.78 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 5.06 కోట్లు, గుంటూరు జిల్లాలో 8.17 కోట్లు, కృష్ణా జిల్లాలో 5.32 కోట్లు, నెల్లూరు జిల్లాలో 3.19 కోట్లు రాబట్టింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 5.90 కోట్లు, ఓవర్సీస్‌లో 11.66 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 99.65 కోట్లు, 158.60 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

సర్కారు వారి పాట లాభాల్లోకి వస్తుందా?
సర్కారు వారి పాట సినిమా కలెక్షన్లు వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ చిత్రం లాభాల్లోకి ప్రవేశిస్తుందా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ వారం రోజుల్లోనే ఈ చిత్రం భారీగా వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. వచ్చే వారం భారీ చిత్రాలు రిలీజ్ అవుతుండటం వల్ల ఈ సినిమాపై వాటి ప్రభావం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











