Sarkaru Vaari Paata day 3 collections ఊహించని కలెక్షన్లు.. మూడో రోజు ఎంత వసూలు చేసిందంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారీ పాట అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ బాక్సాఫీస్ వద్ద నిలకడగాగా వసూళ్లను సాధిస్తున్నది. రిలీజ్ తర్వాత తొలి ఆట నుంచి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్న ఈ చిత్రం అనేక ట్రోల్స్, నెగిటివ్ ట్రెండ్ నుంచి పాజిటివ్ జోన్‌లోకి ప్రవేశించినట్టు కనిపిస్తున్నది. అయితే మూడో రోజున ఈ సినిమా కలెక్షన్ల అంచనాలు ఎలా ఉన్నాయంటే..

నైజాంలో ఆకట్టుకొని సర్కారు వారి పాట
సర్కారు వారీ పాట రిలీజ్ తర్వాత మూడో రోజు అంటే శనివారం వారాంతం కావడంతో పలు ప్రాంతాల్లో హౌస్‌పుల్స్ కనిపించాయి. నైజాంలో మాత్రం ఎలాంటి గ్రోత్ కనిపించకపోవడంతో చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురి చేసినట్టు సమాచారం. అయితే ఆంధ్రాలో నిలకడగా వసూళ్లను సాధించడం ఉపశమనంగా మారింది.

బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్
ట్విట్టర్‌లో సర్కారు వారీ పాట హ్యాండిల్ నుంచి పాజిటివ్ ట్వీట్ చేసింది అభిమానుల్లో జోష్ పెంచారు. సినిమా రిలీజ్ రోజున తొలి ఆట నుంచి నెగిటివ్ హ్యాష్ ట్యాగ్స్, మీమ్స్‌తో దుష్ప్రచారం చేశారు. ప్రస్తుతం #BlockbusterSVP హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. శనివారం ఫస్ట్, సెకండ్ షో ఫుల్స్‌గా నడుస్తున్నాయి. ఇది సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఉన్న అభిమానం అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

అమెరికాలో పేలవంగా కలెక్షన్లు
ఇక అమెరికాలో సర్కారు వారీ పాట చిత్రం అంతంతా మాత్రంగానే కలెక్షన్లు కురిపిస్తున్నది. రెండు రోజుల్లో ఈ చిత్రం 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అయితే కడపటి వార్తలు అందే సరికి ఈ చిత్రం 157957 డాలర్లను వసూలు చేసినట్టు సమాచారం.

మూడో రోజు ఆంధ్రా, నైజాంలో
ఇక సర్కారు వారీ పాట ఆంధ్రాలో పాజిటివ్‌గా దూసుకెళ్తుండగా.. నైజాంలో పెద్దగా స్పందన కనిపించం లేదు. ఈ చిత్రం మూడో రోజున ఆంధ్రా, తెలంగాణలో మొత్తంగా 15 కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం కనిపిస్తున్నది. ఫస్ట్, షో, సెకండ్ షోలకు మంచి రెస్పాన్స్ రావడంతో వసూళ్లు మెరుగ్గా నమోదయ్యే అవకాశం ఉంది.

100 కోట్ల క్లబ్‌లో చేరిన మహేష్
సర్కారు వారి పాట చిత్రం మూడో రోజున మరో ఘనతను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం అతివేగంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నైజాంలో ఈ సినిమాపై టికెట్ రేట్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. లేకపోతే రెండో రోజునే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టానికి అవకాశం ఉండేది.

2022లో నాలుగో చిత్రంగా
సర్కారు వారి పాట చిత్రం 2022 సంవత్సరంలో 100 కోట్ల గ్రాస్ సాధించిన నాలుగో చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. RRR, రాధేశ్యామ్ మూవీ 1 రోజులు 100 కోట్లు సంపాదిస్తే.. సర్కారు వారీ పాటచ భీమ్లా నాయక్ చిత్రం మూడు రోజుల్లో కలెక్షన్లను రాబట్టింది.


Click it and Unblock the Notifications











