Sarkaru Vaari Paata మూవీకి అన్ని కోట్ల డీల్: ఆల్‌టైం రికార్డు సెట్ చేయబోతున్న మహేశ్ బాబు

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను ఏర్పరచుకుని.. ఫ్యాన్‌బేస్‌తో పాటు మార్కెట్‌ను సెట్ చేసుకున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా కలెక్షన్లను రాబట్టే సత్తా ఉన్న ఈ హీరో.. ఈ మధ్య కాలంలో వరుసగా సక్సెస్‌ల మీద సక్సెస్‌లను అందుకుంటున్నాడు. ఈ జోష్‌తోనే మరిన్ని సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకు వచ్చాయి. దీంతో మహేశ్ బాబు ఆల్‌టైం రికార్డును క్రియేట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఆ లెక్కలేంటో మీరు కూడా చేసేయండి!

సర్కారు వారి పాట అంటున్నాడు

సర్కారు వారి పాట అంటున్నాడు

వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

సినిమా కథ... మహేశ్ రోల్స్ ఇలా

సినిమా కథ... మహేశ్ రోల్స్ ఇలా

బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ 'సర్కారు వారి పాట' మూవీని రూపొందిస్తున్నారట. హీరో తండ్రైన బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన విలన్.. విదేశాలకు పారిపోతాడు. అప్పుడు హీరో.. తన తండ్రి కోసం విలన్‌ను ఎలా పట్టించాడనేదే ఈ మూవీ కథ ప్రచారం జరుగుతోంది. ఇక, ఇందులో మహేశ్ బాబు పాత్ర పాత రోజులు గుర్తు చేసేలా ఉంటుందట.

రికార్డులు బ్రేక్.. భారీ అంచనాలు

రికార్డులు బ్రేక్.. భారీ అంచనాలు

షూటింగ్ మొదలై చాలా కాలమే అవుతోన్న 'సర్కారు వారి పాట' మూవీ నుంచి అప్‌డేట్లు పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో ఆ మధ్య వచ్చిన టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే, ఇటీవలే విడుదలైన 'కళావతి' సాంగ్‌ సైతం ట్రెండింగ్ అయింది. దీంతో ఈ రెండు రికార్డులు బద్దలు కొట్టేశాయి. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయని చెప్పొచ్చు.

షూటింగ్ అప్‌డేట్... జెట్ స్పీడు

షూటింగ్ అప్‌డేట్... జెట్ స్పీడు

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతూ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా ఫారెన్ షెడ్యూల్‌ను జరుపుకుంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా షూట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోనూ షూట్ చేశారు. ఇలా ఇప్పటి వరకూ ఈ మూవీ షూటింగ్ 70 శాతం మాత్రమే పూర్తైందని అంటున్నారు.

 మహేశ్ మూవీకి భారీ డిమాండ్

మహేశ్ మూవీకి భారీ డిమాండ్

క్రేజీ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ కమర్షియల్ మూవీగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో బజ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి వచ్చే అప్‌డేట్లు రెస్పాన్స్‌ను దక్కించుకుంటున్నాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం పోటీ ఏర్పడింది. దీంతో అన్ని ఏరియాల హక్కులకు మంచి డిమాండ్ పలుకుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు

'సర్కారు వారి పాట' మూవీకి సంబంధించి ఇప్పటికే చాలా ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాంతాల హక్కులు రూ. 110 కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌తో కలుపుకుంటే మొత్తంగా రూ. 140 కోట్ల బిజినెస్ చేసిందని టాక్.

మహేశ్ ఖాతాలో ఆల్‌టైం రికార్డ్

మహేశ్ ఖాతాలో ఆల్‌టైం రికార్డ్

మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' థియేట్రికల్ రైట్స్ రూ. 140 కోట్లకు అమ్ముడుపోయాయని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంతో తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకూ మహేశ్ సినిమాల్లో స్పైడర్ మాత్రమే (రూ. 124.80 కోట్లు) అత్యధిక బిజినెస్ చేసింది. ఇప్పుడు సర్కారు వారి పాట దాన్ని బ్రేక్ చేయబోతుంది. అంటే ఇదే ఆల్‌టైం రికార్డు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X