Sarkaru Vaari Paata: రెండు రాష్ట్రాల నుంచి బంపరాఫర్.. బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత కరోనా కారణంగా వెండితెరకు చాలా ఎక్కువ గ్యాప్ ఇచ్చిన మహేష్ బాబు ఈ సినిమాతో ఎలాగైనా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. ఇప్పటికే సినిమా ట్రైలర్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం నుంచి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా టికెట్ల విషయంలో గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అడ్వాన్స్ బుకింగ్ ఆన్లైన్ లో ఎప్పుడు మొదలవుతాయి అనే వివరాల్లోకి వెళితే...

అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్
మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుంది అని ప్రేక్షకుల్లో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు పరశురామ్ కూడా ఈ సినిమా రిజల్ట్ పై చాలా ధీమాగా ఉన్నాడు మహేష్ స్థాయిని పెంచే విధంగానే సినిమాను తెరపైకి తీసుకు వచ్చినట్లు చెప్పాడు.

విభిన్నమైన షేడ్స్ లో..
గీత గోవిందం సినిమా తర్వాత ఈ దర్శకుడు మరి కొన్ని ఆఫర్లు వచ్చినప్పటికి కూడా మహేష్ బాబుతో సినిమా చేయాలనే ఆలోచనతోనే మిగతా వాటిని పక్కన పెట్టేశాడు. మొత్తానికి సర్కారు వారి పాట సినిమా అనుకున్నట్లుగానే వచ్చినట్లు తెలియజేశాడు. ఇక ఈ సినిమాలో మహేష్ విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడు అని ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు నచ్చే సన్నివేశాలు కూడా చాలానే ఉంటాయి అని తెలియజేశారు.

టికెట్ల రేట్లు..
అయితే సినిమా టికెట్ల రేట్ల పెరుగుదల విషయంలో చిత్ర యూనిట్ సభ్యులకు శుభవార్త వినిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్లు విషయంపై అనేక రకాల సమస్యలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి ఆచార్య సినిమాకు మునుపటి రేట్ల కంటే కొంత పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మహేష్ సినిమాకు అత్యధికంగా 200 రూపాయల టికెట్లు అలాగే 150 రూపాయల టికెట్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కూడా..
ఇక తెలంగాణలో అయితే ఆచార్య సినిమాకు ఏ విధంగా పెంచారో ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా కూడా అదే తరహాలో పెంచుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ వీకెండ్ లోనే సినిమా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చే విధంగా టికెట్ల రేట్లను అందుబాటులోకి తీసుకు రాబోతున్నారట.

ఆ ప్రభావం కలెక్షన్స్ పై..
అయితే టికెట్ల రేట్లు ఒకేసారి అత్యధికంగా పెరిగిపోవడం వలన ప్రేక్షకులు కూడా కొంత అసహనంతోనే ఉన్నారు. ఆ ప్రభావం ఆచార్య సినిమాపై గట్టిగానే పడింది. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా కూడా అదే తరహాలో టికెట్ల రేట్లు పెంచడంతో ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడే అవకాశం లేకపోలేదు.

బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే?
అయితే సర్కారు వారి పాట సినిమా కంటెంట్ పై చిత్ర యూనిట్ మొత్తం చాలా నమ్మకంతో ఉంది. తప్పకుండా పెట్టిన పెట్టుబడి వెనక్కి తెస్తుంది అని కూడా అనుకుంటున్నారు. ఇక ఆన్లైన్లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విడుదలకు 5 రోజుల ముందే ఓపెన్ కానున్నట్లు తెలుస్తోంది. సినిమా 12 వ తేదీన విడుదల అవుతుండగా బుక్ మై షో లో అలాగే ఇతర ఆన్లైన్ టికెట్స్ ఆప్ లలో 7వ తేదీ నుంచి బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











