Sarkaru Vaari Paata : మహేష్ బాబు రేంజ్‌కు మించి ప్రీ రిలీజ్ బిజినెస్.. వరల్డ్ వైడ్ ఎన్ని కోట్లంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కూడా కావాల్సి ఉంది. కానీ కరోనా సహా అనేక ఇతర కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. గీత గోవిందం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు హీరోగా నటించడంతో ఈ సినిమాకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఏరియా వారీగా ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రారంభమైన నుంచి అంచనాలు
సరిలేరు నీకెవ్వరు లాంటి సూపర్ హిట్ అందుకున్న తరువాత మహేష్ బాబు ఎంతో కాలం గ్యాప్ తీసుకున్నాడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన మరో సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా పరుశురాం దర్శకత్వంలో సినిమా ప్రకటించారు మహేష్ బాబు. పరశురాం చేసిన సినిమాలన్నీ మంచి హిట్ కావడంతో పాటు ఆయన చివరి సినిమా గీత గోవిందం అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

భారీ బిజినెస్
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నదియా, సముద్రకని వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ స్టఫ్ అద్భుతంగా ఉండడంతో పాటు ప్రేక్షకులలో సినిమా మీద ఏర్పడిన అంచనాలను రెట్టింపు చేసే విధంగా మారింది. ఈ నేపథ్యంలోనే సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. మహేష్ బాబు గత చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా బిజినెస్ కూడా బాగా జరిగింది.

నైజాం ప్రాంతంలో ఎంతంటే
ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా బిజినెస్ మేరకు జరిగింది అనేది పరిశీలిస్తే తెలంగాణ ప్రాంతం అయిన మైదానంలో ఈ సినిమాని 36 కోట్ల రూపాయలకు అమ్మారు నిర్మాతలు. సరిలేరు నీకెవ్వరు సినిమా నైజాం ప్రాంతంలో ఇరవై నాలుగున్నర కోట్ల రూపాయలకు మాత్రమే అమ్ముడైంది. ఈఅంటే సినిమాకు ఏకంగా 10 కోట్ల రూపాయల బిజినెస్ పెరిగింది అని చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్ లో ఎంత జరిగింది అంటే
ఇక ఈ సినిమాకు సీడెడ్ ప్రాంతంలో 14 కోట్ల రూపాయలకు హక్కులు అమ్ముడుపోయాయి. అలాగే ఉత్తరాంధ్ర 13 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లా ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లా ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి జిల్లా 7 కోట్ల 20 లక్షలు, కృష్ణాజిల్లా ఏడున్నర కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో మూడు కోట్ల 80 లక్షల రూపాయల మేర హక్కులు అమ్ముడుపోయాయి. దాదాపుగా అన్ని ప్రాంతాలలో కూడా సరిలేరు నీకెవ్వరు సినిమా కంటే బిజినెస్ ఎక్కువగానే జరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా
అలా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 98 కోట్ల యాభై లక్షల రూపాయలకు సర్కారు వారి పాట హక్కులు అమ్ముడుపోయాయి. అలాగే తెలుగు రాష్ట్రాల కాకుండా మిగతా భారతదేశం మొత్తం పది కోట్ల రూపాయలు, ఓవర్సీస్ లో 11 కోట్ల రూపాయలకు ఈ హక్కులు అమ్ముడుపోయాయి. వ్యాప్తంగా 119 కోట్ల 50 లక్షల రూపాయలకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

హిట్ అవ్వాలంటే
అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా విషయానికి వస్తే కేవలం తెలుగు రాష్ట్రాల్లో 75 కోట్ల 70 లక్షల రూపాయల బిజినెస్ మాత్రమే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా 103 కోట్ల రూపాయల బిజినెస్ మాత్రమే జరిగింది. ఈ సినిమాకు బడ్జెట్ తో పాటు బిజినెస్ కూడా పెరగడం గమనార్హం. ఈ సినిమా హక్కులు మొత్తం కలిపి 19 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్ముడుపోయి కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించాలంటే 180 కోట్ల రూపాయల దాకా వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఇక హిట్ అనిపించుకోవడానికి 123 కోట్ల రూపాయలు సాధిస్తే సరిపోతుంది.


Click it and Unblock the Notifications











