Sathi Leelavathi Day 1 Collections: సతీ లీలావతి కలెక్షన్స్.. లావణ్య త్రిపాఠి మూవీకి తొలిరోజు ఎంతంటే?

గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు మెగా కోడలు లావణ్య త్రిపాఠి. వరుణ్ తేజ్‌ను పెళ్లాడినప్పటికీ ఆమె నటనను కొనసాగించారు. అయితే ఈలోగా గర్భం దాల్చడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. పండంటి మగబిడ్డను ప్రసవించిన లావణ్య .. ఆ తర్వాత కొడుకు ఆలనా పాలన కోసం మరికొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన మూవీ సతీ లీలావతి. సమ్మర్ కానుకగా మే 8వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో సతీ లీలావతి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఎంత? అనేది పరిశీలిస్తే...

సతీ లీలావతి తారాగణం
సతీ లీలావతి మూవీని దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ నిర్మించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ ప్రెజెంటర్‌గా వ్యవహరించగా.. తాతినేని సత్య దర్శకత్వం వహించారు. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహించగా.. బీనెంద్ర మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా, సతీష్ సూర్య ఎడిటర్‌గా వ్యవహరించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. దేవ్ మోహన్, నరేష్, మడోన్నా సెబాస్టియన్, వీటీవీ నరేష్, సప్తగిరి, మోట్ట రాజేంద్రన్, జాఫర్ సాదిఖ్, తాగుబోతు రమేష్, జోషి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Sathi Leelavathi Day 1 Expected Box Office Collections Worldwide Lavanya Tripathi s film Opening day Report

సతీ లీలావతి బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి సతీ లీలావతి సినిమాకు 12 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై బజ్ నెలకొంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 13 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. భిన్న మనస్తత్వాలున్న భార్యాభర్తల మధ్య సాగే చిత్రమే ఈ సతీ లీలావతి. ఒకరు విడాకులు కావాలని, మరొకరు బంధాన్ని నిలబెట్టుకోవాలని చసే పోరాటం చుట్టూ ఈ కథను అల్లారు. ఈ తరం జంటల మధ్య సాగుతున్న ఎమోషనల్ డ్రామాగా మలిచారు.

సతీ లీలావతి డే 1 కలెక్షన్స్ అంచనా
ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన సతీ లీలావతిపై మంచి బజ్ నెలకొంది. ప్రస్తుతం థియేటర్‌లలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఏ మాత్రం టాక్ బాగున్నా లావణ్య త్రిపాఠి మూవీకి మంచి వసూళ్లు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీకెండ్, సమ్మర్ హాలీడేస్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బాగుంటుందని భావిస్తున్నారు. సతీ లీలావతి మూవీ తొలిరోజు సాయంత్రం 4 గంటల వరకు ఇండియా వైడ్‌గా 404 షోలతో 18 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లు సాక్‌నిల్క్ పేర్కొంది.

ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 95 షోలు, విశాఖలో 38 షోలు, విజయవాడలో 22 షోలు చొప్పున ప్రదర్శితమయ్యాయి. ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ బాగుంటాయని అంచనా వేస్తున్నారు. బుక్ మై షోలో ఈ సినిమాకు 2.7కే యూజర్ ఇంట్రెస్ట్ నమోదైంది. తొలిరోజు సతీ లీలావతి మూవీ వరల్డ్ వైడ్‌గా కోటి రూపాయల రేంజ్‌లో వసూళ్లు రాబడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి లావణ్య త్రిపాఠి మూవీ ఏ మేరకు వసూళ్లు రాబడుతుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X