Krishnamma 2 Days Collections: రికార్డు కొట్టిన సత్యదేవ్.. 2 రోజుల్లోనే అన్ని కోట్లు.. హిట్ కావాలంటే!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన మార్కును చూపించే సినిమాలు చేస్తూ.. ప్రతి చిత్రాన్ని అదిరిపోయే నటనతో వన్ మ్యాన్ షోగా మార్చేస్తున్నాడు టాలెంటెడ్ హీరో సత్యదేవ్. రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే అతడు.. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్నాడు.

ఇలా ఇప్పుడు సక్సెస్‌ను టార్గెట్ చేస్తూ 'కృష్ణమ్మ' అనే సినిమాలో నటించాడు. ఈ మూవీకి మొదటి రోజు డీసెంట్ కలెక్షన్లు రాగా.. రెండో రోజు మాత్రం కాస్త పెరిగాయి. ఈ నేపథ్యంలో 'కృష్ణమ్మ' సినిమా రెండు రోజుల్లో ఎంత వసూళ్లు రాబట్టిందో మీరే చూసేయండి మరి!

Satyadev Kancharana Starrer Krishnamma Movie 2 Days Worldwide Collections Details

కృష్ణమ్మతో సత్యదేవ్ రాక
విలక్షణ నటుడు సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మాస్ సినిమానే 'కృష్ణమ్మ'. వీవీ గోపాలకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాను అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇందులో అనిత రాజ్ హీరోయిన్‌గా నటించగా.. మీసాల లక్ష్మణ్, కృష్ణ బూరుగుల, అర్చన తదితరులు నటించారు. కాల భైరవ దీనికి సంగీతాన్ని అందించాడు.

సత్యదేవ్ మూవీకి బిజినెస్

సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న సత్యదేవ్ నటించిన చిత్రమే 'కృష్ణమ్మ'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే మంచి ఆసక్తిని ఏర్పరచగలిగింది. ఫలితంగా అంచనాలను కూడా భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా అదిరిపోయే డిమాండ్‌ను ఏర్పరచుకుని భారీ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 2.70 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది.

Satyadev Kancharana Starrer Krishnamma Movie 2 Days Worldwide Collections Details

2వ రోజు తెలుగులో ఇలా
వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా నటించిన 'కృష్ణమ్మ' చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం మొదటి రోజు మోస్తరు వసూళ్లనే రాబట్టింది. అయితే, రెండో రోజు మాత్రం ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే పెరిగాయి. ఫలితంగా 2వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిసి రూ. 45 లక్షలు షేర్, రూ. 90 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

2 రోజులకు కలిపి ఎంత

టాలీవుడ్‌ టాలెంటెడ్ గాయ్ సత్యదేవ్ హీరోగా నటించిన 'కృష్ణమ్మ' సినిమాకు టాక్‌కు అనుగుణంగానే రెస్పాన్స్ మోస్తరుగానే లభిస్తోంది. అయినప్పటికీ అతడి కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌ను అందుకున్నాడు. ఇలా రెండు రోజుల్లోనే ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 95 లక్షలు షేర్‌తో పాటు రూ. 1.65 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Satyadev Kancharana Starrer Krishnamma Movie 2 Days Worldwide Collections Details

ప్రపంచ వ్యాప్తంగా ఎంత
ఎమోషనల్ అండ్ మాస్ స్టోరీతో రూపొందిన 'కృష్ణమ్మ' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 95 లక్షలు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 20 లక్షలు రాబట్టింది. వీటితో కలిపి 2 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 1.15 కోట్లు షేర్‌, రూ. 2.10 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇది అతడి కెరీర్‌లో టాప్ వసూళ్లు అని తెలిసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?

సత్యదేవ్ హీరోగా నటించిన 'కృష్ణమ్మ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.70 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.00 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజుల్లో సత్యదేవ్ సినిమాకు రూ. 1.15 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.85 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X