Krishnamma 4 Days Collections: కృష్ణమ్మపై దాని ఎఫెక్ట్.. 4 రోజుల్లో ఇంతే.. సత్యదేవ్ హిట్ కొట్టాలంటే!
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేసేశాడు టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ముఖ్యంగా హీరోగా మారిన తర్వాత విభిన్నమైన చిత్రాలతో స్పెషల్‌గా నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ యంగ్ హీరో 'కృష్ణమ్మ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీకి మొదటి వీకెండ్‌లో మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. కానీ, ఎలెక్షన్ డే ఎఫెక్టుతో 4వ రోజు డౌన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో 'కృష్ణమ్మ' సినిమా నాలుగు రోజుల్లో ఎంత వసూళ్లు రాబట్టిందో మీరే చూసేయండి మరి!
ఎమోషనల్ స్టోరీతో ఎంట్రీ:టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన మాస్ అండ్ ఎమోషనల్ మూవీనే 'కృష్ణమ్మ'. వీవీ గోపాలకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాను అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇందులో అనిత రాజ్ హీరోయిన్‌గా నటించగా.. మీసాల లక్ష్మణ్, కృష్ణ బూరుగుల, అర్చన తదితరులు నటించారు. కాల భైరవ దీనికి మ్యూజిక్ ఇచ్చాడు.

సత్యదేవ్ మూవీకి బిజినెస్:చాలా కాలంగా విజయం కోసం చూస్తున్న సత్యదేవ్ నటించిన చిత్రమే 'కృష్ణమ్మ'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే మంచి ఆసక్తిని ఏర్పరచగలిగింది. ఫలితంగా అంచనాలను కూడా భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా అదిరిపోయే డిమాండ్‌ను ఏర్పరచుకుని భారీ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 2.70 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసింది.
4వ రోజు తెలుగులో ఇలా:వీవీ గోపాలకృష్ణ డైరెక్షన్‌తో సత్యదేవ్ హీరోగా నటించిన 'కృష్ణమ్మ' చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం మొదటి వీకెండ్‌లో మోస్తరు వసూళ్లనే రాబట్టింది. అయితే, ఎలెక్షన్ డే అయిన 4వ రోజు మాత్రం బాగా డౌన్ అయింది. ఫలితంగా దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిసి రూ. 25 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

4 రోజులకు కలిపి ఎంత:టాలీవుడ్ విలక్షణ నటుడు సత్యదేవ్ హీరోగా నటించిన 'కృష్ణమ్మ' సినిమాకు టాక్‌కు అనుగుణంగానే రెస్పాన్స్ మోస్తరుగానే లభిస్తోంది. అయినప్పటికీ అతడి కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌ను అందుకున్నాడు. అయితే, 4 రోజుల్లో మాత్రం ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 1.30 కోట్లు షేర్‌తో పాటు రూ. 2.45 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత:ఎమోషనల్ అండ్ మాస్ స్టోరీతో తెరకెక్కిన 'కృష్ణమ్మ' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 4 రోజుల్లో రూ. 1.30 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 25 లక్షలు రాబట్టింది. వీటితో కలిపి 4 రోజుల్లో సత్యదేవ్ నటించిన ఈ చిత్రానికి రూ. 1.55 కోట్లు షేర్, రూ. 2.80 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:సత్యదేవ్ హీరోగా చేసిన 'కృష్ణమ్మ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.70 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.00 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో సత్యదేవ్ సినిమాకు రూ. 1.55 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.45 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











