Krishnamma Day 1 Collections: సత్యదేవ్ మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. మొదటి రోజు ఎంత వచ్చిందో తెలిస్తే!

క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొదలు పెట్టి.. ఆ తర్వాత సోలో హీరోగా మారి.. అప్పటి నుంచి డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తున్నాడు సత్యదేవ్. ఫలితాలు ఎలా ఉన్నా ప్రతి చిత్రంలోనూ అద్భుతమైన నటనను కనబరుస్తూ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. అయితే, ఈ సారి భారీ విజయాన్ని అందుకోవాలన్న కోరికతో 'కృష్ణమ్మ' అనే సినిమా చేశాడు. ఈ చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ మూవీకి మొదటి రోజు మోస్తరు స్పందనే లభించింది. మరి 'కృష్ణమ్మ' సినిమా తొలి రోజు ఎంత వసూళ్లు రాబట్టిందో మీరే చూడండి!

మాస్ అవతారంలో సత్యదేవ్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన తాజా చిత్రమే 'కృష్ణమ్మ'. వీవీ గోపాలకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాను అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇందులో అనిత రాజ్ హీరోయిన్‌గా నటించగా.. మీసాల లక్ష్మణ్, కృష్ణ బూరుగుల, అర్చన తదితరులు నటించారు. కాల భైరవ దీనికి మ్యూజిక్‌ను అందించాడు.

Satyadev Kancharana Starrer Krishnamma Movie Day 1 Worldwide Collections Details

సత్యదేవ్ మూవీకి బిజినెస్
చాలా గ్యాప్ తీసుకుని సత్యదేవ్ నటించిన సినిమానే 'కృష్ణమ్మ'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 3.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

మిక్స్‌డ్ టాక్‌తో తక్కువగా
ఎమోషనల్ అండ్ మాస్ స్టోరీతో రూపొందిన 'కృష్ణమ్మ' మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆ రేంజ్‌లోనే అంటే మిశ్రమంగా లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలోనే కంటే తక్కువ వసూళ్లు వస్తాయని టాక్ వినిపించింది.

Satyadev Kancharana Starrer Krishnamma Movie Day 1 Worldwide Collections Details

తొలి రోజు తెలుగులో ఇలా
టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో వచ్చిన 'కృష్ణమ్మ' చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, ఈ సినిమా టాక్‌ను అనుకున్న విధంగా తెచ్చుకోలేకపోయింది. ఫలితంగా మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిసి సత్యదేవ్ సినిమాకు రూ. 40 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత
విలక్షణ నటుడు సత్యదేవ్ నటించిన 'కృష్ణమ్మ' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 40 లక్షలు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 10 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలిపి మొదటి రోజు ఈ చిత్రానికి రూ. 50 లక్షలు షేర్‌తో పాటు రూ. 1.00 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

Satyadev Kancharana Starrer Krishnamma Movie Day 1 Worldwide Collections Details

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
ఎమోషనల్ స్టోరీతో వచ్చిన 'కృష్ణమ్మ' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు సత్యదేవ్ సినిమాకు రూ. 50 లక్షలు వచ్చాయి. అంటే మరో రూ. 3.00 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X