Krishnamma Movie Business: సత్యదేవ్ మూవీకి ఊహించని బిజినెస్.. ఎన్ని కోట్లు వస్తే హిట్ అవుతుందంటే!

విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు టాలెంటెడ్ హీరో సత్యదేవ్. చాలా కాలం పాటు వరుసగా సినిమాలు అందించిన అతడు.. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'కృష్ణమ్మ' అనే ఎమోషనల్ మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మంచి హైప్ క్రియేట్ అయింది. మరి సత్యదేవ్ నటించిన ఈ సినిమా థియేట్రికల్ పరంగా ఎన్ని కోట్లు బిజినెస్‌ను చేసుకుందో మీరే చూసేయండి మరి!

మాస్ స్టోరీతో వచ్చిన హీరో:విలక్షణ నటడు సత్యదేవ్ హీరోగా చేసిన సినిమానే 'కృష్ణమ్మ'. వీవీ గోపాలకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాను అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇందులో అనిత రాజ్ హీరోయిన్‌గా నటించగా.. మీసాల లక్ష్మణ్, కృష్ణ బూరుగుల, అర్చన తదితరులు నటించారు. కాల భైరవ దీనికి మ్యూజిక్‌ను కంపోజ్ చేశాడు.

Satyadev Kancharana Starrer Krishnamma Movie Pre Release Business Details

ఆ స్టోరీతో ఎమోషనల్‌గా:సరదాగా తమ జీవితాలను నడుపుకుంటోన్న స్నేహితులు అనుకోకుండా ఓ కేసులో చిక్కుకోవడం.. ఆ తర్వాత వాళ్లకు ఎన్నో సమస్యలు రావడం.. దానివల్ల కథ ఎలా మలుపు తిరిగింది? అనే అంశాలతో తెరకెక్కిన సినిమానే 'కృష్ణమ్మ'. ఎమోషనల్ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. దీంతో దీనిపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

గ్రాండ్ రిలీజ్.. టాక్ అలా:చాలా కాలంగా భారీ విజయం కోసం వేచి చూస్తోన్న సత్యదేవ్ నటించిన 'కృష్ణమ్మ' మూవీ ఎన్నో అంచనాలతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి స్పందన కూడా లభిస్తోంది. ఇదే కంటిన్యూ అయితే కలెక్షన్లు కూడా భారీగానే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Satyadev Kancharana Starrer Krishnamma Movie Pre Release Business Details

సినిమా ప్రీ బిజినెస్ ఇలా:సత్యదేవ్ నటించిన చిత్రం కావడంతో పాటు కొరటాల శివ నిర్మాణ భాగస్వామిగా ఉండడంతో 'కృష్ణమ్మ' మూవీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పైగా దీని నుంచి వచ్చి ప్రచార చిత్రాలు అన్నీ ఆకట్టుకోవడంతో హైప్ భారీగా పెరిగిపోయింది. ఫలితంగా సత్యదేవ్ నటించిన ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో కలిపి రూ. 2.50 కోట్లు మేరు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే:సత్యదేవ్ - వీవీ గోపాల కృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన 'కృష్ణమ్మ' మూవీపై అందరూ బాగానే ఫోకస్ చేశారు. అందుకు తగ్గట్లే మార్కెట్ పరంగా ఇది బయ్యర్ల దృష్టిని ఆకట్టుకుంది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 50 లక్షలకు అమ్ముడైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 3.00 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది.

Satyadev Kancharana Starrer Krishnamma Movie Pre Release Business Details

అన్ని కోట్లు వస్తేనే హిట్:సత్యదేవ్ నటించిన 'కృష్ణమ్మ' సినిమాకు ఊహించని విధంగా రూ. 3.00 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 3.50 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వసూలు చేస్తేనే 'కృష్ణమ్మ' సినిమా కమర్షియల్‌గా విజయం సాధిస్తుంది. మౌత్ టాక్ మంచిగా వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మొత్తం రాబట్టడం కష్టమేమీ కాదు అనే చెప్పుకోవాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X