Satyam Sundaram Collections: కార్తీ కెరీర్‌లో రికార్డు ఓపెనింగ్స్.. సత్యం సుందరం మూవీకి ఎన్ని కోట్లంటే?
తమిళ నటులు కార్తీ, అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నది. 96 మూవీ ఫేమ్ దర్శకుడు సీ ప్రేమ్ కుమార్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ కూడగట్టుకొంటున్నది. సౌత్ ఇండియాలో స్టార్ హీరో, హీరోయిన్లు సూర్య, జ్యోతిక నిర్మాతలుగా మారి రూపొందించిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? రోజువారీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తమిళంలో మీఅలగన్‌గా 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించిన ఈ సినిమాను ఫ్యామిలీ ఎమోషన్స్, బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ తెరకెక్కింది. తక్కువ మంది ఆర్టిస్టులతో, టాలెంటెడ్ టెక్నీషియన్స్‌తో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ముందు భారీగా ప్రమోషన్స్ చేశారు. ఈ సినిమా ప్రమోషనల్ ఖర్చులు, నిర్మాణ వ్యయంతో కలిపి ఈ మూవీ 40 కోటల్ రూపాయలు అయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కార్తీ, అరవింద్ స్వామి లాంటి హీరోలు ఉండటంతోపాటు రిలీజ్‌కు ముందు మంచి బజ్ ఏర్పడటంతో బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ సినిమాను సుమారుగా 1000కిపైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా 45 కోట్ల రూపాయలుగా లెక్క కట్టారు. అలాంటి భారీ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
తమిళంలో ఈ సినిమా తొలి రోజు భారీ రెస్పాన్స్ కూడగట్టుకొన్నది. తొలి రోజు ఈ సినిమా 55 శాతానికి పైగా ఆక్యుపెన్సీ సాధించింది. కోయంబత్తూరు, పాండిచ్చేరి, కొచ్చి, త్రిచి, చెన్నై, మధురై ప్రాంతాల్లో భారీగా ఆక్యుపెన్సీ నమోదు చేసింది. తొలి రోజు పాజిటివ్ టాక్‌తో రెండో రోజు భారీగా ఆక్యుపెన్సీ నమోదు అయ్యేలా చేసింది.

తమిళంలో ఈ సినిమా తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తమిళంలో 3.1 కోట్ల నికర వసూల్లు, 6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ఈ మూవీ 2 కోట్లు నికరంగా 4 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా తొలి రోజు 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను వరల్డ్ వైడ్‌గా వసూలు చేసింది.
ఇక మీఅలగన్ సినిమాను తెలుగులో సత్యం సుందరం అనే టైటిల్‌తో ఒక రోజు ఆలస్యంగా తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రీమియర్లకు సూపర్ టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతాయని చెబుతున్నారు. ఈ సినిమా తొలి రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది, అలాగే రెండో రోజు తమిళంలో మరో 5 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 20 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











