Satyam Sundaram Box Office: 40 కోట్ల టార్గెట్‌తో కార్తీ మూవీ.. 3 రోజుల్లో సత్యం సుందరంకు ఎన్ని కోట్లంటే?
తమిళంలో మీ అలగన్, తెలుగులో సత్యం సుందరంగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్నది. కార్తీ, అరవింద్ స్వామి నటించిన ఈ చిత్రం తమిళంలో సెప్టెంబర్ 27వ తేదీన, తెలుగులో సెప్టెంబర్ 28వ తేదీన విడుదలైంది. 96 మూవీ ఫేమ్ దర్శకుడు సీ ప్రేమ్ కుమార్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను హీరో, హీరోయిన్లు సూర్య, జ్యోతిక నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ ఎంత? వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
సత్యం సుందరం సినిమా అతి తక్కువ పాత్రలతో పూర్తిగా తెలుగు నేటివిటికి తగినట్టుగా హృదయాన్ని టచ్ చేసే విధంగా కథను తెరకెక్కించారు. ఈ సినిమాకు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో నిర్మించారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, టెక్నిషియన్స్ పారితోషికంతో కలిపి ఈ సినిమాను సుమారుగా 43 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.

మీఅలగన్ సినిమాకు తమిళంలోను, సత్యం సుందరం టైటిల్‌తో తెలుగులో రీలీజైన ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా స్పందన రావడంతో సుమారుగా ఇండియాలో 1000 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా 40 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.
మీఆలగన్ (సత్యం సుందరం) సినిమాకు నార్త్ అమెరికాలో మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. ప్రీమియర్ల ద్వారా 30 వేల డాలర్లు, తొలి రోజు 70 వేల డాలర్లు, రెండో రోజు 80 వేల డాలర్లు, మూడో 1 లక్ష డాలర్లు వసూలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 300K డాలర్లు అంటే.. 2.5 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక తమిళంలో ఈ సినిమా తొలి రోజు 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 5 కోట్ల రూపాయలు రాబట్టింది. గత రెండు రోజుల్లో ఈ సినిమా తమిళంలో 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా తమిళంలో మెల్లమెల్లగా కలెక్షన్లను పెంచుకొంటూ పోతున్నది.
ఇక తెలుగులో తొలి రోజు 40 లక్షలు, రెండో రోజు 40 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తెలుగులో 80 లక్షలు నికరంగా, 1.6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











