Satyam Sundaram Day 4 Collections: భారీగా పెరిగిన సత్యం సుందరం కలెక్షన్లు.. కార్తీ మూవీకి ఎన్ని కోట్లంటే?

దక్షిణ భారతంలో విలక్షణ నటులు అరవింద్ స్వామి, కార్తీ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం సత్యం సుందరం. ఫన్, ఎమోషన్స్, ఫీల్ గుడ్ మూమెంట్స్, ఫ్యామిలీ వ్యాల్యూస్‌తో రూపొందిన ఈ సినిమాకు 96 చిత్రాన్ని అందించిన ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. భావోద్వేగమైన కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీని స్టార్ హీరో, హీరోయిన్లు జ్యోతిక, సూర్య నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

తమిళంలో మీఅలగన్ , తెలుగులో సత్యం సుందరం టైటిల్‌తో రీలీజైంది. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, టెక్నిషియన్స్ పారితోషికంతో కలిపి ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా స్పందన రావడంతో సుమారుగా ఇండియాలో 1000 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా 40 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

Satyam Sundaram Day 3 Box Office Collections Worldwide Meiyazhagan Day 4 Box Office Collections

ఈ మూవీ తమిళంలో తొలి రోజు 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 5 కోట్ల రూపాయలు, మూడో రోజు 6 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత నాలుగు రోజుల్లో ఈ సినిమా 16 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 24 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక తెలుగులో సత్యం సుందరం మూవీగా రిలీజైన ఈ చిత్రం ఒకరోజు ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 28వ తేదీన రిలీజైంది. తెలుగులో ఈ సినిమా గత మూడు రోజుల్లో 1.60 కోట్లు షేర్, 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక కర్ణాటకలో 1.55 కోట్లు, కేరళలో 50 లక్షలు రాబట్టింది. మిగితా రాష్ట్రాల్లో ఈ సినిమా 30 లక్షలు రాబట్టింది.

Satyam Sundaram Day 3 Box Office Collections Worldwide Meiyazhagan Day 4 Box Office Collections

ఇక సత్యం సుందరం సినిమాకు ఓవర్సీస్‌లో మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ సినిమా రోజు రోజుకు బాక్సాఫీస్ వద్ద పుంజుకొంటున్నది. ఈ చిత్రం గత 4 రోజుల్లో 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ మూవీ ఇప్పటి వరకు 27 కోట్లకుపైగా గ్రాస్, 14 కోట్ల షేర్ వసూలు చేసింది. నార్త్ అమెరికా, యూకే, గల్ఫ్ దేశాల్లో స్ట్రాంగ్ హోల్డ్ కలిగి ఉంది.

ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. తమిళం వెర్షన్ లాభాల్లోకి రావాలంటే కనీసం 20 కోట్ల రూపాయలు, తెలుగు వెర్షన్ ప్రాఫిట్‌లోకి రావాలంటే.. 4.5 కోట్ల వసూలు చేయాలి. దాదాపు ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది. త్వరలోనే ఈ సినిమా లాభాల జోన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X