Savi Collections కోట్ల కలెక్షన్లు కురిపిసున్న అభినవ సావిత్రి డ్రామా.. అనిల్ కపూర్ మూవీ కలెక్షన్లు ఎంతంటే?
బాలీవుడ్‌లో సినీ ప్రముఖులు ముఖేష్ భట్, భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మాతలుగా అభినయ్ ఢియో దర్శకత్వంలో రూపొందిన చిత్రం సావి. బాలీవడ్ స్టార్ హీరో అనిల్ కపూర్, టీ సిరీస్ అధినేత సతీమణి, నటి దివ్య ఖోస్లా, హర్షవర్ధన్ రాణే, రాగేశ్వరి లూంబా తదితరులు నటించిన ఈ చిత్రం మే 31న రిలీజ్ అయింది. గత మూడు రోజులుగా ఈ సినిమా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం అయిన ఖర్చు ఎంత? బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత రాబట్టాలనే వివరాల్లోకి వెళితే..
సావి సినిమా విషయానికి వస్తే.. ఫ్రెంచ్‌లో సక్సెస్ కొట్టిన పోర్ ఎల్లే అనే సినిమా ఆధారంగా తెరకెక్కింది. పురాణాల్లో సతీ సావిత్రి జీవితం ఆధారంగా స్పూర్తి పొంది ఈ సినిమాను రూపొందించారు. అత్యంత పకడ్బంధీగా హై సెక్యూరిటీ జైలులో ఉన్న భర్తను రక్షించుకోవడానికి భార్య చేసిన ప్రయత్నం ఏమిటనే కథతో ఈ సినిమా రూపొందింది.

ఇక అనిల్ కపూర్ లాంటి స్టార్ హీరోతోపాటు పలువురు హిందీ, ఆంగ్ల నటులు మేలవింపుతో ఈ సినిమాను రూపొందించారు. దాంతో ఈ సినిమాను ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సుమారుగా 10 కోట్ల రూపాయల షేర్‌ను నిర్ణయించారు.
సావి సినిమా ప్రమోషన్స్‌కు భారీగా స్పందన రావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి మంచి డిమాండ్ ప్రేక్షకుల నుంచి రావడంతో సుమారుగా 1000 స్క్రీన్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఈ సినిమా తొలి రోజు నుంచే నిలకడగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబడుతున్నది.

సావి చిత్రం భారీగా కాకున్న ఓ మోస్తారుగా వసూళ్లను సాధిస్తున్నది. తొలి రోజు 2 కోట్ల రూపాయల నెట్, 3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండో రోజు 2.75 కోట్ల నికరంగా, 3.75 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. మూడో రోజు ఈ సినిమా 2.75 కోట్లు నికరంగా, 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా 10 కోట్ల గ్రాస్ వసూళ్లను 7.5 కోట్ల నికరంగా కలెక్షన్లను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











