2.5 మిలియన్: యూఎస్ఏలో ‘మహానటి’ మరో సంచలనం
Recommended Video

ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కించిన 'మహానటి' చిత్రం మూడో వారంలోకి ఎంటరైనప్పటికీ యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఇంకా అదిరిపోయే వసూళ్లూ సాధిస్తూనే ఉంది. మూడో వారాంతం పూర్తి కావడంతో 19 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2.5 మిలియన్ డాలర్ మార్కును అందుకుంది. అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల్లో 6వ స్థానంలో నిలిచింది. సాధారణ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఇంత భారీ విజయం సాధించడంపై ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

నేల టిక్కెట్, అమ్మమ్మగారిల్లు ప్రభావం లేదు
ఇటీవల రవితేజ నటించిన ‘నేల టిక్కెట్టు', నాగ శౌర్య నటించిన ‘అమ్మమ్మగారిల్లు' చిత్రాలు విడుదలయ్యాయి. అయితే వీటి ప్రభావం ‘మహానటి'పై పెద్దగా పడలేదు. మూడో వారాంతం 57 స్క్రీన్లలో ప్రదర్శితం అయిన ఈ చిత్రం $102,995 వసూలు చేసింది. దీంతో యూఎస్ఏ టోటల్ కలెక్షన్ 19 రోజుల్లో $2,502,995కు చేరింది.
వైజయంతి మూవీస్ ట్వీట్
యూఎస్ఏ బాక్సాపీసు వద్ద ‘మహానటి' 2.5 మిలియన్ వసూలు చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తూ వైజయంతి మూవీస్ వారు ట్వీట్ చేశారు. సావిత్రమ్మ బాక్సాఫీసును రూల్ చేస్తోంది, సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ అంటూ అని పేర్కొన్నారు.

యూఎస్ఏ టాప్ 10 మూవీస్
బాహుబలి 2 : $21 మిలియన్
బాహుబలి: $8.46 మిలియన్
రంగస్థలం: $3.51 మిలియన్
భరత్ అనే నేను: $3.41 మిలియన్
శ్రీమంతుడు: $2.89 మిలియన్
మహానటి: $2.50 మిలియన్
అ..ఆ: $2.44 మిలియన్
ఖైదీ నెం 150: $2.44 మిలియన్
ఫిదా: $2.067 మిలియన్
అజ్ఞాతవాసి: $2.065 మిలియన్

భారీ లాభాలు
‘మహానటి' మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 20 కోట్లకు అమ్మారు. సినిమా ఇప్పటి వరకు రూ. 30 కోట్ల పై చిలుకు షేర్ వసూలు చేయడంతో నిర్మాతలతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలు తమ ఖాతాలో వేసుకున్నారు.


Click it and Unblock the Notifications











