‘సవ్యసాచి’ బాక్సాఫీస్ రిపోర్ట్: రెండు రోజుల్లో ఎంత వసూలైందంటే?
నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రిమూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన 'సవ్యసాచి' బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం లేదు. చైతు గత చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు' సాధించిన వసూళ్లతో పోలిస్తే ఓపెనింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించిన మైత్రి మూవీస్ సంస్థ నుంచి వచ్చిన చిత్రం కావడం, చైతన్యతో పాటు సౌత్ స్టార్ మాధవన్ ఇందులో నటించడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత మిక్డ్స్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

భారీగా ఖర్చు చేసిన మైత్రి మూవీస్
‘సవ్యసాచి' చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది. ప్రమోషన్స్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకున్నారు. నాగ చైతన్య గత చిత్రాలన్నింటికంటే గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు. అత్యధిక స్క్రీన్లలో విడుదల చేశారు.

ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయంటే..?
భారీ అంచనాలతో విడుదలైన సవ్యసాచి తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం చైతూ కెరీర్లనే హ్యయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధిస్తుందని భావించారు. శైలజారెడ్డి రికార్డ్స్(తొలి రోజు రూ. 13.16 కోట్ల గ్రాస్) అధిగమిస్తుందని అంచనా వేశారు. కానీ అది సాధ్యం కాలేదు.

చాలా మంది అంటున్న మాట ఇదే...
సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది, కానీ దాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు విఫలం అయ్యారనే టాక్ చాలా మంది నుంచి వినిపిస్తోంది. ఈ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో రెండో రోజు కలెక్షన్లపై మరింత ప్రభావం పడింది. శనివారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 4 కోట్లకు మించి వసూలు చేయలేదని తెలుస్తోంది.

డిస్ట్రిబ్యూటర్ గణాంకాలు
రెండు రోజుల కలెక్షన్ కలిపి టోటల్ గ్రాస్ రూ. 11.70 కోట్లకు రీచ్ అయింది. ఇందులో రూ. 6.30 కోట్ల షేర్ మిగిలింది. ‘సవ్యసాచి' గ్లోబల్ థియేట్రికల్ రైట్స్ రూ. 22.50 కోట్లకు అమ్మారు. మరో 16 కోట్లకుపైగా షేర్ రికవరీ అవ్వాల్సి ఉంది. అయితే దీపావళి సీజన్ కావడంతో ఇటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ... నమ్మంకగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











