షాకింగ్‌గా సవ్యసాచి కలెక్షన్లు.. వెనుకబడిన చైతూ.. డిస్టిబ్యూటర్ల పెట్టుబడికి!
అక్కినేని నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన సవ్యసాచి చిత్రం తొలివారంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందనే వార్త ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్నది. తన కెరీర్‌లో బెస్ట్ అయిన శైలజారెడ్డి అల్లుడు మూవీ కలెక్షన్లను బీట్ చేయలేకపోవడం గమనార్హం. మరి కొద్ది రోజులు అగితే బాక్సాఫీస్ వద్ద సినిమా పరిస్థితి ఏమిటో తెలియడం ఖాయం. మూడు రోజుల సవ్యసాచి కలెక్షన్లు ఇలా ఉన్నాయి..

సవ్యసాచిపై భారీ అంచనాలు
ఇటీవల విడుదలైన నాగచైతన్య మూవీ శైలజారెడ్డి అల్లుడు కమర్షియల్‌గా మంచి వసూళ్లను రాబట్టింది. దాంతో సవ్యసాచిపై భారీ అంచనాలు పెరిగాయి. ప్రమోషన్ కార్యక్రమాలు సినిమాకు హైప్ పెంచాయి. శైలజారెడ్డి అల్లుడు సినిమా తొలి రోజు కలెక్షన్లను సవ్యసాచి అధిగమిస్తుందని అందరూ వేచి చూశారు.

ప్రేమమ్ వసూళ్లను దాటినా..
నవంబర్ 2 తేదీన విడుదలైన సవ్యసాచి నాగచైతన్య కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచిన ప్రేమమ్ వసూళ్లు గ్రాస్ రూ.15 కోట్లను అధిగమించింది. కానీ శైలజారెడ్డి అల్లుడు సినిమా వసూళ్లలో సగం కూడా సాధించలేకపోయిందనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.

మూడు రోజుల్లో కలెక్షన్లు
శైలజారెడ్డి అల్లుడు చిత్రం తొలివారాంతం (మూడు రోజుల్లో)లో రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించగా, సవ్యసాచి కేవలం రూ.16 కోట్ల గ్రాస్, రూ.8.50 కోట్ల నికర కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను రూ.22.70 కోట్లకు అమ్మడం జరిగిందట.

డిస్టిబ్యూటర్లకు ఎంతొచ్చిందంటే..
డిస్టిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి మొత్తంలో కేవలం 35 శాతం రాగా, ఇంకా 65 శాతం వసూళ్లను రాబట్టాల్సి ఉంది. సినిమాలకు లిట్మస్ టెస్ట్‌గా నిలిచే సోమవారం సవ్యసాచి బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకొంటే నాగచైతన్య సినిమా కమర్షియల్‌గా ఓ రేంజ్‌కు చేరుకొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











