సవ్యసాచికి డీసెంట్ ఓపెనింగ్స్.. చైతూ కెరీర్‌లోనే అత్యధికంగా..
ప్రేమమ్ విజయం తర్వాత అక్కినేని నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి జతకట్టి సవ్యసాచి చిత్రాన్ని రూపొందించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం తొలి ఆట నుంచి మిశ్రమ స్పందన అందుకొన్నది. అయితే మొదటి రోజున అమెరికా, తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ కలెక్షన్లను రాబట్టడం విశేషంగా మారింది. యూఎస్‌లో తొలి రోజు ప్రీమియర్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

ఓవర్సీస్ బిజినెస్ ఎంతంటే..
విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిందనే విస్తృత ప్రచారంతో సవ్యసాచి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఓవర్సీస్ బిజినెస్ పెద్ద మొత్తంలోనే జరిగింది. రూ.3.5 కోట్లు చెల్లించి ఈస్ట్, వెస్ట్ ఎంటర్‌టైనర్ ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకొన్నది. అమెరికాలో ఈ చిత్రాన్ని సుమారు 140 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ప్రీమియర్లకు డీసెంట్ ఓపెనింగ్స్
సవ్యసాచిపై ఉన్న క్రేజ్ కారణంగా భారీగా అడ్వాన్స్ బుకింగ్‌లు జరిగాయి. ప్రీమియర్లకు మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. తొలి రోజున ప్రీమియర్ల రూపంలో 114 లొకేషన్ల నుంచి 104569 డాలర్లు రాబట్టింది. ఈ మొత్తం ప్రేమమ్ సినిమా ప్రీమియర్ల కంటే ఎక్కువ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి.

నాగచైతన్య కెరీర్‌లో
నాగచైతన్య కెరీర్‌లోనే సవ్యసాచి అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఇటీవల విడుదలైన శైలజారెడ్డి అల్లుడు చిత్రం యూఎస్‌లో ప్రీమియర్ల రూపంలో 107,448 డాలర్లు రాబట్టగా, సవ్యసాచి 104569 డాలర్లు వసూలు చేయడం గమనార్హం.

విభిన్నమైన కథ, పాయింట్‌తో
సవ్యసాచి ఓ విభిన్నమైన చిత్రంగా తెరకెక్కింది. వైద్యశాస్త్రంలోని వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే ఓ స్పెషల్ పాయింట్‌తో చిత్రం రూపొందింది. తల్లిగర్భంలో కవలలు ఉన్నట్టు గుర్తించినా.. ఒక్కరే జన్మించడం జరుగుతుంది. రెండో పిండం జన్మించిన వ్యక్తి దేహంలో ఉంటుంది. దీనినే వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అని అంటారు. ఈ కథను రివేంజ్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో మాధవన్ విలన్‌గా కనిపించడం విశేషం.


Click it and Unblock the Notifications











